ఆ హీరోని తొక్కేస్తున్నారట..

Nivin Pauly About Negative Campaign On His Movie

10:34 AM ON 20th February, 2016 By Mirchi Vilas

Nivin Pauly About Negative Campaign On His Movie

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికైనా సరైన అవకాశాలు రాకపోతే తమను తొక్కేస్తున్నారని చాలామంది గగ్గోలు పెట్టడం మనకు తెలిసిందే. మన ఇండస్ట్రీలోనే మల్లూఉడ్ లో అదేనండీ మలయాళ చిత్ర పరిశ్రమలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ మాట అంటోంది.. ఏ చిన్నా చితకా వేషాలు వేసిన నటుడు కాదు.. సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన ఓ స్టార్. అక్కడ సీనియర్ హీరోలదే ఇంకా హవా. దీంతో కొత్త హీరోలు తమ సత్తా చాటేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. లేకపోతే టాలెంట్ ఉన్నా కనుమరుగైపోవాల్సి వస్తోంది. మల్లూఉడ్ యూత్ స్టార్ నవిన్ పాలీ కూడా ఇప్పుడు ఇదే తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నేరమ్.. బెంగళూరు డేస్.. 1983.. ఓం శాంతి ఓషానమ్.. ఒరు వాడక్కన్ సెల్ఫీ.. వంటి సినిమాలతో స్టార్ గా గుర్తింపు పొందాడు నవిన్ పాలీ.. ఇక అతను నటించిన ప్రేమమ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. నవిన్ నటించిన తాజా చిత్రం యాక్షన్ హీరో బిజు. ఇటీవలే విడుదలైన ఈ సినిమాపై ప్రస్తుతం జోరుగా సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం సాగుతోంది. దీంతో ఇదంతా కావాలనే జరుగుతోందని.. తనను ఎలాగైనా తొక్కేయాలని కొందరు చూస్తున్నారని ఆరోపిస్తున్నాడు. ఎంతగా ట్రై చేసినా.. తన సినిమా సినీ ప్రేమికుల ఆదరణతో నిలదొక్కుకుందని, ఇప్పుడు మంచి టాక్ తో రన్ అవుతోందని చెప్పాడు.

English summary

Malayalam Young Hero Nivin Pauly had got craze by super hit films Neram,Banglore Days,Premam etc in Malayalam.Recently he acted in Action Hero Biju movie.In that movie he acted as police officer .He says that "There were certain groups who were trying to plant negative reports against the film on social media, right after the first show".