షార్ట్స్ తో కాలేజీకి అమ్మాయిలు

NLSIU Professor Shames A Girl For Wearing Shorts

11:22 AM ON 9th April, 2016 By Mirchi Vilas

NLSIU Professor Shames A Girl For Wearing Shorts

అవునా అంటే, అవుననే సమాధానం వస్తుంది. కాలేజీలలో సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీల నృత్యాలు వంటివి సంచలనం సృష్టిస్తుంటే , తాజాగా షార్ట్స్ తో కాలేజీకి అమ్మాయిలు వస్తున్నారట. ఇది ముమ్మాటికీ నిజం .. బెంగళూరుకు, చెందిన ఒక కాలేజీలో అమ్మాయిలు షార్ట్స్ వేసుకొని సంచలనం సృష్టించారు. ఇదంతా ఏదో ఫ్యాషన్ షో కోసం కాదు.. ఒక ప్రొఫెసర్ కు నిరసన తెలిపేందుకు అమ్మాయిలు షార్ట్స్ తో కాలేజీకి వచ్చారు. దీంతో.. ఈ అంశం కలకలం రేపింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఇష్యూ గురించి, అమ్మాయిలు యుద్ధం ప్రకటించిన ప్రొఫెసర్ కూడా వెనక్కి తగ్గ లేదు సరికదా, తాను లేవనెత్తిన అంశం మీద ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధమేనని సవాలు విసరటంతో ఈ ఇష్యూ రోజురోజుకీ ముదురుతోంది.

ఇవి కూడా చదవండి:పవన్ 2 రూపాయల ఆర్టిస్ట్

వివరాల్లోకి వెళ్తే, బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీలో ఓ అమ్మాయి షార్ట్స్ వేసుకొని వచ్చింది. అలాంటి దుస్తులు వేసుకొని రావటం ఏమిటంటూ ఆ అమ్మాయిని ఒక ప్రొఫెసర్ ప్రశ్నిస్తూ, సరైన దుస్తులు వేసుకొని క్లాస్ కు రావాలంటూ మిగిలిన అమ్మాయిల ముందు మందలించాడు. దీంతో ఆ విద్యార్థిని కి అవమానకరం అనిపించింది. మిగిలిన అమ్మాయిల దగ్గర తన వేదనను వ్యక్తం చేసింది. తాము వేసుకునే డ్రెస్సుల మీద ప్రొఫెసర్ తమకు చెప్పటం ఏమిటన్న వాదనను తెర మీద తీసుకురావటమే కాదు.. తమ దుస్తుల గురించి సదరు ప్రొఫెసర్ అభ్యంతరకర మాటలు మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తోంది.

ఇవి కూడా చదవండి:సర్దార్ తోనైనా పవన్ కళ్ళు తెరవాలన్న వర్మ

అసలు దుస్తుల మీద వ్యాఖ్య చేసిన ప్రొఫెసర్ కు తీరుకు నిరసనగా ఆ క్లాస్ అమ్మాయిలంతా షార్ట్స్ వేసుకు రావాలని నిర్ణయించారు. అదే విధంగా షార్ట్స్ తో క్లాస్ కి హాజరయ్యారు. తమను అవమానించిన ప్రొఫెసర్ మీద చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసారు. ఇదిలా ఉంటే.. విద్యార్థిని వేసుకున్న దుస్తుల మీద తాను అన్న మాటలపై సదరు ఫ్రొఫెసర్ స్టాండ్ అయ్యారు. అంతేకాదు ఈ విషయంలో ఎలాంటి దర్యాఫ్తుకైనా తాను సిద్ధమని ప్రొఫెసర్ తేల్చి చెబుతున్నారు. మొత్తానికి ఈ మధ్య ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి.

ఇవి కూడా చదవండి:

సర్దార్ సినిమా కోసం కత్తులతో దాడి.. ఒకరి మృతి

కెమెరాకు చిక్కిన మత్స్య కన్య

బాలయ్య ఆరోగ్య రహస్యం అదా ..

English summary

National Law School Of India (NLSIU) professor shamed a girl student for coming by wearing shorts to the college.Then that Student feel shamed and All the other female students wear shorts to college and came to college by demanding to suspend that professor from that college.