మోడీ వార్నింగ్ తో మాల్యాకు తిప్పలు తప్పవా ?

No Bank Defaulter Will Be Spared Says Narendra Modi

11:58 AM ON 29th March, 2016 By Mirchi Vilas

No Bank Defaulter Will Be Spared Says Narendra Modi

దేశంలోని పలు బ్యాంకులకు వేలాది కోట్లు ఎగ్గొట్టి.. గుట్టుచప్పుడు కాకుండా దేశం విడిచి వెళ్లి పోయిన లిక్కర్ కింగ్ మాల్యా గురించి దేశం మొత్తంగా తెలీని వారంటూ ఉండని పరిస్థితి వచ్చేసింది. ఎక్కడ చూసినా మాల్యా అన్ని వేల కోట్లు ఎగ్గొడితే ఏమీ చేయలేని బ్యాంకులు సామాన్యుల విషయంలో కఠినంగా వ్యవహరించడం దారుణమని విమర్శలు వస్తూనే వున్నాయి. విలాసపురుషుడిగా సుపరిచితుడైన విజయ్ మాల్యా దేశం నుంచి వెళ్ళిపోవడం పెద్ద కలకలమే రేపింది. మీడియాలో విస్తృతంగా వార్తలు రావటంతో దేశ వ్యాప్తంగా మాల్యా గురించి పెద్ద రగడ జరుగుతోంది. పాలకపక్షం పై విమర్శల జడివాన కురుస్తోంది. ఈ దశలోనే మాల్యా వ్యవహారంలో ప్రధాని మోడీ పెద్దగా జోక్యం చేసుకోవటం లేదన్న విమర్శలు వచ్చినా.. ఆయన నోటి నుంచి ఎలాంటి మాటా రాలేదు. అయితే తాజాగా ఆయన మాల్యా గురించి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రభావమో.. మరింకేదైనా కారణమో కానీ.. మోడీ మొత్తానికి లేటుగా నైనా స్పందించారు. ఢిల్లీలో జరిగిన బ్లూమ్ బర్గ్ ఇండియా ఎకనామిక్ ఫోరంలో మోడీ మాట్లాడుతూ, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న పారిశ్రామిక పెద్దలు.. గౌరవంగా బ్యాంకులకు తిరిగి అప్పులు చెల్లించకుంటే తిప్పలు తప్పవని తేల్చి చెప్పారు.

ఇవి కూడా చూడండి : డబ్బుల్లేవ్ అంటూనే బాబు గారి ఖర్చు 133కోట్లా?

అంతేకాదు బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టే పారిశ్రామికవేత్తల్ని వదిలిపెట్టమని, వారి నుంచి బకాయిలు వసూలు కోసం తమ ప్రభుత్వం.. ఆర్బీఐ లు కఠిన చర్యలు తీసుకుంటాయని మోడీ తెగేసి చెప్పేశారు. మీడియా కూడా ఈ విషయంపై దృష్టి పెట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మాల్యా దేశం నుంచి పరారీ అయ్యారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ.. బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టే వారి విషయంపై ఇప్పటివరకూ పెద్దగా మాట్లాడని మోడీ.. తాజాగా సీరియస్గా వార్నింగ్ ఇవ్వటం.. అది కూడా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇదే తరహా వార్నింగ్ ఇచ్చిన రెండో రోజునే మోడీ స్పందించడం చూస్తుంటే, మాల్యాకి చుక్కలు చూపించడానికి రంగం సిద్ధం అయిందా అనే మాట వినిపిస్తోంది. ఇన్నాళ్ళూ మాల్యా విషయంలో మోడీ సర్కారు మిన్నకుండిపోయిందన్న ఆరోపణలు మోడీ అండ్ కో గుర్తించి, ఇలాంటి భావనలు పోగొట్ట దానికి మోడీ నేరుగా స్పందించినట్లు తెలుస్తోంది. పైగా త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా మాల్యా ఇష్యూను విపక్షాలు రాజకీయం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. తాము ముందే చెక్ చెప్పేయాలని మోడీ నోట వార్నింగ్ వచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి మాల్యాకు తిప్పలు తప్పవా ?

ఇవి కూడా చూడండి :

ప్రేమ వ్యవహారంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

ఊపిరికి ఫోర్బ్స్ ప్రశంసలు

నగ్నంగా నటించడానికి నేను రెడీ..

బాహుబలికి అవార్డా? అంటూ వర్మ ట్వీట్

English summary

Indian Prime Minister Narendra Modi has Finally responded on the bank defaulters. Narendra Modi said that No bank Defaulters will be spared and every industrialist have to pay the loan to certain banks.