ఎన్టీఆర్ ఫాన్స్ కి బాడ్ న్యూస్: ఏపీలో 'జనతా' బెనిఫిట్ షోలు లేనట్టే!

No benifit shows in AP for Janatha Garage movie

03:33 PM ON 30th August, 2016 By Mirchi Vilas

No benifit shows in AP for Janatha Garage movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఏపీ సర్కార్ ఇప్పుడు జనతా గ్యారేజ్ చిత్రానికి పెద్ద షాకిచ్చింది. అదేంటంటే.. అన్ని సినిమాల లేట్ నైట్.. బెనిఫిట్ షోలను రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడమే ఇందుకు కారణమం. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. దీంతో జూనియర్ ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్ బెనిఫిట్ షో చూసే అవకాశం ఉండదని అతని అభిమానులు నీరసించిపోయారు. విజయవాడకు చెందిన థర్డ్ పార్టీ డిస్ట్రిబ్యూటర్లు కొందరు ఈ చిత్రం బెనిఫిట్ షో స్క్రీనింగ్ హక్కులను సుమారు పాతిక లక్షలకు కొన్నారని, కానీ ప్రభుత్వ జీవోతో ఇక తమకు నష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.

అయితే తెలంగాణాలో మాత్రం జనతా గ్యారేజ్ లేట్ నైట్, బెనిఫిట్ షోలకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఈ షోలను శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ సంస్థ 70 లక్షలకు అమ్మినట్టు చెబుతున్నారు. హైదరాబాద్ లోని కుకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్ వంటి చోట్ల ఈ నెల 31వ తేదీ రాత్రికే చాలా థియేటర్లు లేట్ నైట్ షోలను ప్రదర్శించనున్నాయి. కానీ ఏపీలో మాత్రం ఎన్టీఆర్ అభిమానులకి ఇది నిజంగా చేదు వార్తే.

ఇది కూడా చదవండి: పబ్లిక్ లోనే శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన పాప్ సింగర్!

ఇది కూడా చదవండి: ప్రేమతో ప్రియుడ్ని కసిగా మెడపై కొరికింది.. దాంతో..

ఇది కూడా చదవండి: ధనవంతులు కావాలంటే మీ రాశి ప్రకారం ఇలా చెయ్యండి

English summary

No benifit shows in AP for Janatha Garage movie. AP government passed latest rule that their is no benifit shows for any films in AP.