మెగాబ్రదర్స్ మధ్య తగాదాలు లేనట్టే!!

No clashes between Mega Brothers

12:09 PM ON 28th January, 2016 By Mirchi Vilas

No clashes between Mega Brothers

మెగాబ్రదర్స్‌ పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ -మెగాస్టార్‌ చిరంజీవి లు మధ్య సత్సంబంధాలు లేవని మీడియాలో గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. చిరు పుట్టినరోజున జరిగిన సంగీత్ కి పవన్‌ హాజరయ్యాడు. అలాగే 'బ్రూస్‌లీ' సినిమాలో మెగాస్టార్‌ ఎంట్రీ విషయం గురించి చిరుని కలిసి అభినందించాడు పవన్‌. అయినప్పటికీ అలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల జరిగిన ఒక సంఘటనతో ఈ వార్తలకు తెరపడింది. పవన్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఘాటింగ్‌ తో బిజీగా ఉన్నాడు. సర్దార్‌ సెట్‌లో చిరు సందడి చేశాడు. చిరు సర్దార్‌ సెట్స్‌కు వెళ్ళి అక్కడ పవన్‌ మరియు సినిమా టీమ్ తో కాసేపు టైం స్పెండ్‌ చేశాడు.

'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమాలో విలన్‌గా నటిస్తున్న కబీర్‌ దుహాన్ సింగ్‌ ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. ఈ రోజు సెట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి గారిని కలిసాను ఆయన గోల్డెన్‌ హార్ట్‌ ఉన్నవ్యక్తి. చిరునవ్వుతోనే పలకరించే గొప్పమనసు ఆయనది. అని సోషల్‌ మీడియాలో తెలిపాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ఈ సినిమా ఘాటింగ్‌ జరుగుతుంది. శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకుడు. కాజల్‌ అగర్వాల్‌ ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ సినిమాలో సంజన, రాయ్‌లక్ష్మీ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.

English summary

No clashes between Mega Brothers Mega Star Chiranjeevi and Power Star Pawan Kalyan. Their is lot of rumours between these mega brothers. Chiranjeevi went to Sardar Gabbar Singh movie sets.