అక్కడ ‘నో హెల్మెట్.. నో పెట్రోల్’

No helmet no fuel rule in odisha capital Cuttack

11:02 AM ON 15th June, 2016 By Mirchi Vilas

No helmet no fuel rule in odisha capital Cuttack

మొత్తానికి హెల్మెట్ వాడకంపై ఎన్ని అవగాన సదస్సులు పెట్టినా ఎన్ని ఫైన్ లు వేసినా లాభం లేదని చాలాచోట్ల వినిపించే మాట. కానీ ఒడిశా రాష్ట్ర రాజధాని కటక్ లోని పోలీసులు ఒక చిట్కా కనిపెట్టారు. ద్విచక్రవాహనాల్ని వినియోగించే వారు హెల్మెట్లు తప్పనిసరి అన్న విషయాన్ని ఎంతలా చెప్పినా ప్రజలు దాన్ని పట్టించుకోని పరిస్థితి వుండడం, హెల్మెట్లు లేని కారణంగా.. రోడ్డు ప్రమాదాలు జరిగితే తీవ్ర గాయాల పాలవ్వడం, ఒక్కోసారి ప్రాణాలు పోవడం జరుగుతున్నాయి. ఈ విషయం మీద ఎంత ప్రచారం చేసినా.. ఫలితం లేకపోవడంతో దీనికి చెక్ చెప్పాలన్న ఉద్దేశంతో కటక్ పోలీసులు వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. జూలై ఒక నుంచి హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్ కు వెళితే.. పెట్రోల్ పోయకూడదన్నది నిబంధనగా పెట్టబోతున్నారు. ‘నో హెల్మెట్.. నో పెట్రోల్’ పేరిట ప్రచారం చేయాలని నిర్ణయించారు. హెల్మెట్ లేకుండా వాహనం మీద రోడ్డు మీదకు వస్తే.. పెట్రోల్ కూడా దొరకదన్న సందేశం ప్రజల్లోకి వెళితే.. ఎవరు చెప్పినా.. చెప్పకున్నా అందరూ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుంటారని కటక్ పోలీసులు భావిస్తున్నారు.

నిజానికి కటక్ పోలీసులు ఆలోచన బాగుందని చెప్పాలి. రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించటానికి ఈ నిర్ణయం ఎంతో మేలు చేయటం ఖాయం. మరి.. కటక్ పోలీసులు స్టార్ట్ చేయనున్న ఈ నిర్ణయాన్ని అందిపుచ్చుకొని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు.. పట్టణాల్లోని పోలీసులు అమలు చేస్తే బానే ఉంటుందన్న కామెంట్లు వస్తున్నాయి.

ఇది కూడా చూడండి:ఆ హోటల్ లో యువతిపై అత్యాచారం

ఇది కూడా చూడండి:నెక్స్ట్ మూవీ కోసం బరువు పెరుగుతున్న పవర్ స్టార్

ఇది కూడా చూడండి:ఈ ATM పిన్ నెంబర్స్ వాడారో ఇక అంతే..

English summary

No helmet no fuel rule in Odisha capital Cuttack. Cuttack is the former capital and the second largest city in the eastern Indian state of Odisha.