హమ్మయ్య ఆంక్షలు ఎత్తేశారోచ్ ...

No limits on ATM money withdrawl from Feb 1

11:52 AM ON 31st January, 2017 By Mirchi Vilas

No limits on ATM money withdrawl from Feb 1

రూ 500, రూ 1000 నోట్ల రద్దు తర్వాత ఏటీఎంల్లో నగదు విత్ డ్రాలపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ, తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఎలాంటి నిబంధనలు ఉండవని, ప్రస్తుతం విధించిన ఎత్తివేసినట్టు వెల్లడించింది. ముఖ్యంగా కరెంట్ అకౌంట్లు, క్రెడిట్ కార్డు హోల్డర్లు, ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాదారులపైవున్న ఆంక్షలను ఎత్తి వేస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. ఈ కొత్త రూల్స్ ఫిబ్రవరి 1నుంచి అమల్లోకి రానున్నాయి. జనవరి 16 నుంచి కరెంట్ ఖాతా నుంచి నగదు ఉపసంహరణ పరిమితి వారానికి రూ. 50 వేల నుంచి రూ.లక్షకు పెంచడం తెలుసుకదా. ఇక బ్యాంకుల్లోనూ ప రిమితిని ఆయాశాఖ ల విచ క్షణ కే వ దిలేసింది. ఐతే, సేవింగ్స్ ఖాతాదారులకు ప్రస్తుతమున్న పరిమితులు యథాతథంగా కొనసాగనున్నాయి. అంటే వారానికి రూ. 24 వేలు డ్రా చేసుకునే అవకాశముంది.

ఇది కూడా చూడండి: కుండీలో చెత్త వేయండి - ఫ్రీ వైఫై ఇంటర్నెట్ పొందండి

ఇది కూడా చూడండి: చర్చిలో మార్మోగిన పంచాక్షరీ మంత్రం

English summary

Recently RBI announces there will be no limit on ATM cash withdrawl from February 1st onwards.