మనల్ని ఎవరూ ఆపలేరన్న ట్రంప్

No one can stop us

10:53 AM ON 21st January, 2017 By Mirchi Vilas

No one can stop us

గత నవంబర్ లో ఉద్రిక్తంగా, ఉత్కంఠభరితంగా, ఉద్వేగపూరితంగా జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్ హిల్లరీ క్లింటన్ పై అనూహ్య విజయం సాధించిన 70 ఏళ్ళ డోనాల్డ్ ట్రంప్ అమెరికా 45వ అధ్యక్షుడిగా శుక్రవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. చల్లని వాతావరణంలో, దాదాపు 8 లక్షలమంది అమెరికన్ల సమక్షంలో, భారతీయ కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అబ్రహాం లింకన్ 156 ఏళ్ల క్రితం ప్రమాణ స్వీకారం చేయడానికి వాడిన బైబిల్ ను, తన తల్లి ఇచ్చిన బైబిల్ ను చేతిలో పట్టుకుని ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. అనేకమంది డెమోక్రాట్ శాసనకర్తలు ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించారు. హిల్లరీ క్లింటన్ మాత్రం హాజరయ్యారు.అధ్యక్షుని హోదాలో ట్రంప్ తొలిసారిగా ప్రసంగించారు. 16 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో అమెరికా అమెరికన్లదే అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికన్ల చేతుల మీదుగానే దేశాన్ని పునర్నిర్మాణం చేద్దామని పిలుపునిచ్చారు. ఐకమత్యంగా ఉంటే అమెరికాను ఎవరూ ఆపలేరని, అందరం కలిసికట్టుగా మరోసారి దేశాన్ని బలోపేతం చేద్దామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ ఇక దేశమే తొలి ప్రాధాన్యం కావాలని, అమెరికా గమ్యాన్ని అందరం కలిసి నిర్ణయిద్దామని పిలుపునిచ్చారు.

అమెరికా మొత్తం ఏకతాటిపైకి వస్తే.. ఎవరూ ఆపలేరు. ఎలాంటి భయమూ వద్దు. మనం ఎప్పుడూ భద్రంగానే ఉన్నాం. సైన్యంలోని ధీరులు, దర్యాప్తు సంస్థల సిబ్బంది, ముఖ్యంగా దేవుడు మనకు అండగా నిలబడ్డాడు. మనం భారీగా ఆలోచించాలి. మరింత భారీ కలలు కనాలి. పోరాడుతున్నంత కాలమే దేశం నిలబడుతుందని మనకు తెలుసు. అమెరికా పోరాటం, స్ఫూర్తికి సాటి వచ్చే సవాళ్లేవీ లేవు. మనం విఫలం కారాదు. మన దేశం తిరిగి సుసంపన్నమవుతుంది. మనం కొత్త సహస్రాబ్ది ముంగిట ఉన్నాం. అంతరిక్ష రహస్యాలను ఛేదించటానికి, వ్యాధుల గుట్టుమట్ల నుంచి భూమిని విముక్తం చేయటానికి, శక్తులను క్రోడీకరించటానికి సిద్ధమవుదాం. భవిష్యత్ పరిశ్రమలు, సాంకేతిక పరిజ్ఞానాలను సమ్మిళితం చేయటానికి పూనుకుందాం. నూతన జాతీయ గౌరవం మన ఆత్మలను జాగృతం చేయాలి, మన దృక్కోణాలను ఉన్నతం చేయాలి, విభేదాలు సమసిపోయేలా చేయాలి అని ట్రంప్ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చూడండి : 4 రోజుల్లో బరువు తగ్గడానికి సూపర్ చిట్కా

ఇది కూడా చూడండి : పేరులోని మొదటి అక్షరం తో మీరెలాంటివారో తెలుసుకోవచ్చిలా

English summary