మాల్యా ఇల్లు కొనడానికి భయపడుతున్న బిల్డర్లు

No one is coming front to buy Vijay Mallya house

01:30 PM ON 18th March, 2016 By Mirchi Vilas

No one is coming front to buy Vijay Mallya house

మొదట కింగ్‌ఫిషర్ మద్యం వ్యాపారిగా మొదలు పెట్టిన విజయ్ మాల్యా అది సక్సెస్ కావడంతో అధిక ధనవంతుడుగా మారిపోయాడు. ఆ తరువాత 'కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్' స్ధాపించాడు. దీని తరువాత ఐపిఎల్ లో 'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు' టీమ్ ని సొంతం చేసుకున్నాడు. అంతే కాదు రాజ్యసభ సభ్యత్వం కూడా దక్కించుకున్నాడు. అయితే ఇక్కడే కధ అడ్డం తిరిగింది. ఒక్కసారిగా పెరిగిన మాల్యా అదే రేంజ్ లో పతనానికి చేరువవుతున్నాడు. విలాసాలు, విందులు, ఇంకా చెప్పాలంటే పొందు కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు, ఇప్పుడు దాని ఫలితాన్ని చవి చూస్తున్నట్లు విశ్లేషకుల మాటల్లో వ్యక్తమవుతుంది.

గుట్టుచప్పుడు కాకుండా దేశం వదిలి బ్రిటన్ లోని మారు మూల గ్రామానికి వెళ్ళి తలదాచుకున్న మాల్యాను వెనక్కి రప్పించడానికి భారత సర్కార్ చర్యలు చేపట్టింది. బ్యాంక్ లకు వేల కోట్ల రూపాయలని ఎగ్గొట్టిన మాల్యా ఆస్తుల పై దర్యాప్తు సంస్థలు కన్నేశాయి. ఇందులో భాగంగా మాల్యాకు చెందిన 2401.70 చదరపు మీటర్లలో ఉన్న ఇల్లును రూ. 150 కోట్లకు ధరను నిర్ణయించి వేలం నిర్వహించారు. ఈ వేలంలో పాల్గొనేవాళ్లు రూ.5 లక్షలు చెల్లించి, రూ.15 లక్షలు డిపాజిట్ చేయాలనే నిబంధన విధించింది అయితే పాపం విజయ్ మాల్యా ఇంటిని కొనడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు.

ఈ ఇల్లు ఒక్కటే కాదు ఇంకా గోవాలో మాల్యాకు చెందిన రూ.90 కోట్ల విల్లాలను కూడా బ్యాంకులు స్వాధీనం చేసుకోనున్నారు. మరి ఈ ఆస్తులను కొనడానికి ఎవరొస్తారో చూద్దాం.

English summary

No one is coming front to buy Vijay Mallya house. Bank officers seized Vijay Mallya 150 crores house.