ఎవరు ఛాన్స్ ఇవ్వడం లేదు

No One Was Giving Chance To Sing Says Balakrishna

03:04 PM ON 12th March, 2016 By Mirchi Vilas

No One Was Giving Chance To Sing Says Balakrishna

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు తమ సినిమాలలో పాటలు పాడడం ఒక ట్రెండ్ గా మారిపోయింది. పవన్ కళ్యాణ్ , ఎన్టీఅర్ , రవితేజ , నితిన్ , నారా రోహిత్ వంటి హీరో లు తమ సినిమాలలో స్టార్ పాటలు పాడుతూ స్టార్ సింగర్ లకు తాము ఆ మాత్రం తీసిపోమని నిరుపించడమే కాకుండా , వారి సినిమాలకు సైతం మంచి క్రేజ్ ను తీసుకువస్తున్నారు. ఇప్పుడు అదే కోవలోకి మరో అగ్ర హీరో కుడా చేరాలనుకుంటుంన్నాడు.ఆ హీరో మరెవరో కాదండి నందమూరి బాలకృష్ణ.

ఇటీవల ఒక చిత్రానికి సంబందించిన కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ తనకు తన సినిమాలలో పాట పాడాలని ఉందని తన మనుసులోని మాటను బయట పెట్టాడు. బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ సినిమాలలో పాటలు పాడుతున్నారని , తనకు కుడా పాటలు పాడాలని ఉందని కానీ తనను పాట పాడాల్సిందిగా ఏ సంగీత దర్శకుడు కుడా అడగలేదని , అందు వల్లనే పబ్లిక్ ఈవెంట్స్ లో తాను తన కోరిక తీర్చుకున్తున్నానని జోకులు పేల్చాడు.

ఇది వరకు చాల సందర్బాలలో పాడిన బాలకృష్ణ , ఇటీవల తను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన లేపాక్షి ఉత్సవాలలో కుడా ఒక పాట పాడి తన కోరికను తీర్చుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ తన 100 సినిమా పై త్వరలోనే ఒక క్లారిటీ ఇవ్వనున్నాడు.

English summary

Hero and Politician MLA Nandamuri Balakrishna says that every hero was singing song in their films in recent days and he says that he also wants to sing song but no music director were asking him to sing song .That's the reason that he was singing songs in public events.