జీరో బ్యాలెన్స్ ఉన్నా ఫైన్ ప‌డ‌దు…

No Penalty For Zero Bank Balance Accounts

11:04 AM ON 21st May, 2016 By Mirchi Vilas

No Penalty For Zero Bank Balance Accounts

ఎవ‌రైనా కొత్త‌గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల‌ని ఏదైనా బ్యాంక్‌కు చెందిన బ్రాంచ్‌కు వెళితే బ్యాంకులో మినిమ‌మ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయ‌మ‌ని అడుగుతారు క‌దా. దానర్ధం ఏమంటే, మ‌నం నిర్వ‌హించే లావాదేవీలు ఆ మినిమ‌మ్ బ్యాలెన్స్‌ను చేరుకుంటే మ‌నకు ఎలాంటి చార్జిలు ప‌డ‌వు. లేదంటే క‌చ్చితంగా ఫైన్ ప‌డుతుంది. అది ప్ర‌భుత్వ బ్యాంకుల‌కైతే త‌క్కువ‌గా, ప్రైవేటు బ్యాంకుల‌కైతే ఎక్కువ‌గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:అద్దెకు ఈఫిల్ టవర్

అయితే కొన్ని బ్యాంకులు మాత్రం మినిమమ్ బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేయ‌కుండా ఖాతాలో జీరో బ్యాలెన్స్‌ను ఉంచిన వారిపై కూడా చార్జిలు వేస్తున్నాయ‌ట‌. దీంతో జీరో బ్యాలన్స్ కాస్తా, నెగెటివ్‌గా మారుతోంది. అలా మారిన‌ప్పుడు ఒక‌వేళ వినియోగ‌దారులు ఖాతాలో డ‌బ్బులు జ‌మ చేస్తే అందులోంచి ఫైన్ రుసుం క‌ట్ అవుతోంది. ఈ క్ర‌మంలో అలా నెగెటివ్ బ్యాలెన్స్ వ‌చ్చేలా ఫైన్ వేసే బ్యాంకుల‌ను హెచ్చ‌రిస్తూ రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా ఒక ప్ర‌క‌ట‌న చేసింది.

అదేమిటంటే వినియోగ‌దారులు త‌మ ఖాతాల్లో నెగెటివ్ బ్యాలెన్స్‌ను చూసిన‌ట్ట‌యితే ఇప్పుడు వెంట‌నే బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. దీంతో ఆర్‌బీఐ స‌ద‌రు బ్యాంక్‌పై చ‌ర్య‌లు తీసుకుంటుంది. అంటే జీరో బ్యాలెన్స్ ఉన్నా ఇక‌ పై చార్జ్‌లు ఏమీ ప‌డ‌వ‌న్న‌మాట‌. దీంతో ఇంకా ఎక్కువ మంది బ్యాంక్ అకౌంట్ల‌ను ఓపెన్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని దాదాపు అధిక శాతం మంది వినియోగ‌దారులు ఆహ్వానిస్తున్నారు. ప్ర‌ధానంగా పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుందని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి:అమ్మాయి ఫోన్ దొరికిందని ఏం చేసాడో తెలుసా(వీడియో)

ఇవి కూడా చదవండి:చూపులతో100కోట్లు కొల్లగొట్టిన14 ఏళ్ళ అమ్మాయి(వీడియో)

English summary

Reserve Bank Of India (RBI) Ordered all the banks of India that not impose charges on Zero Balance Accounts. If any bank charged from zero balance accounts then we can complain on that Bank.