పుంజు రెడీ - మరి పందెం...

No Permission For Cock Fight

02:44 PM ON 7th January, 2016 By Mirchi Vilas

No Permission For Cock Fight

ఈ సంక్రాంతికి ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. అదే కోడి పందాలు..... గత ఏడాది ప్రభుత్వం బహిరంగం గానే కోడి పందాలకు ఊతమివ్వడంతో భలే రంజుగా పందెం సాగింది. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించారు. సోషల్ మీడియాలో యమ జోరుగా పందెం ఫోటోలు హల్ చల్ చేసాయి. ఈ ఏడాది కూడా అలాగే ఉంటుందని భావించిన నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసేసుకున్నారు.

వివిధ రకాల పందెం కోళ్ళు గురించి, వాటి విలువ గురించి, సోషల్ మీడియాలో ,సోషల్ వెబ్ సైట్లలో వివరాలు పొందుపరిచారు. పందెం కోళ్ళను కూడా బాగా మేపారు. కానీ హైకోర్టు జోక్యంతో పందెం రాయుళ్ళకు బ్రేక్ పడింది. ఏదో రకంగా ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేస్తుందిలే అని ధీమాగా ఉన్న నిర్వాహకులకు , పందెం రాయుళ్ళకు ఇప్పుడు హైకోర్టు ఆదేశం మింగుడు పడడం లేదు.

సంక్రాంతి సందర్భంగా కోడి పందేలను నిర్వహించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామంటూ హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేయక తప్పలేదు. కోడి పందేల నిర్వహణపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోడి పందేలను అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. కోడి పందేలను జరగనివ్వబోమని, ప్రభుత్వ ఆంక్షలు అతిక్రమించి పందేలు నిర్వహించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ ప్రభుత్వం కోర్టుకు స్పష్టం చేసింది. ప్రభుత్వ వాంగూల్మాన్ని నమోదు చేసుకున్న ధర్మాసనం... దీనిపై ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం ప్రమాణపత్రం దాఖలు చేసింది.

అయితే ఏదో రకంగా ప్రజా ప్రతినిధుల ద్వారా వత్తిడి పెంచి , పందెం సాగేటట్లు చేసుకోవాలని చివరి దాకా నిర్వాహకులు తమ ప్రయత్నం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఏటా కొన్ని వందల కోట్ల రూపాయల బెట్టింగ్ తో సాగే కోడి పందల కోసం ఓ పక్క విస్తృత ఏర్పాట్లు సాగినట్లు వార్తలు వస్తుంటే , తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఈ సంక్రాంతి పందెం రాయుళ్ళు ఏం చేస్తారో , ఒకవేళ పందాలు జరిగితే ప్రభుత్వ చర్యలు సీరియస్ గా ఉంటాయా అనేది చూడాలి.

English summary

Andhra Pradesh high court asked a question to Andhra Pradesh Government that what were the precautions were taken to stop Cock Fight in andhra.