బీఫ్ ఫెస్టివల్ కు అనుమతి లేదన్న హైకోర్టు 

No Permission To Beef Festival Says High Court

12:45 PM ON 9th December, 2015 By Mirchi Vilas

No Permission To Beef Festival Says High Court

ఈనెలలో ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలని విద్యార్ధి , ప్రజాస్వామ్యం సంఘాలు ఏర్పాట్లు చేస్తుంటే , అసలు బీఫ్ ఫెస్టివల్ కి అనుమతి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. బీఫ్ ఫెస్టివల్ కి అనుమతి ఇవ్వవద్దని కోరుతూ కడెం రాజు అనే వ్యక్తి హైకోర్తుని ఆశ్రయించడంతో బుధవారం ఉదయం హైకోర్టు స్పందిస్తూ , బీఫ్ ఫెస్టివల్ కి అనుమతి లేదని , సిటీ సివిల్ కోర్టు ఈ విషయంలో ఇచ్చిన తీర్పుని అమలు పరచాలని పేర్కొంది. శాంతి భద్రతలను కాపాడడానికి పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించింది . బీఫ్ ఫెస్తిఅల్ కోసం ఓ పక్క ఏర్పాట్లు చేస్తుంటే మరోపక్క పంది కూర పండగ చేస్తామని కొందరు , బీఫ్ ఫెస్టివల్ అడ్డుకుంటామని మరికొందరు , ఆరోజు గోపూజ నిర్వహిస్తామని కొందరు ప్రకటించారు. బిజెపి ఎంఎల్ఎ రాజా సింగ్ బీఫ్ ఫెస్టివల్ అడ్డుకుంటామని చెబుతూ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. విమర్శలు , ప్రతి విమర్శలతో వాతావరణం వేడెక్కింది. ఈ నేపధ్యంలో హైకోర్టు తీర్పు తో తీసుకునే చర్యలు పరిస్థతిని ఎటు మళ్ళిస్తుందో .

English summary

High Court Says that there is no permission for the beef festival which was going to be held on 10th december in Osmania University