ప్రత్యేక హోదా లేదని తేలిపోయింది

No Special Status For Andhra Pradesh Says HP Chowdary

11:31 AM ON 30th April, 2016 By Mirchi Vilas

No Special Status For Andhra Pradesh Says HP Chowdary

ఇన్నాళ్ళూ ఎపికి ప్రత్యేక హోదా పై రోజుకో రకంగా మాట్లాడుతూ వస్తున్నా, ముసుగులో గుద్దులాట ఎందుకని ఎట్టకేలకు విషయం బయట పెట్టేసారు. దీన్ని బట్టి ఇక ఎపికి ప్రత్యేక హోదా అన్నది రానే రాదన్న విషయం తేలింది. విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు అన్ని హామీలు నెరవేరుస్తున్నందున... ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి హెచ్‌పీ చౌదరి అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ఏం కావాలో చట్టంలో ఉందని... వాటినే అమలు చేస్తున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లుపై శుక్రవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ... విభజన చట్టంలోని అన్ని అంశాలను నీతిఆయోగ్‌ అధ్యయనం చేస్తోందని... ఏపీకి ఆర్థికసాయంపై నీతిఆయోగ్‌ నివేదిక ఇవ్వనుందని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.2,050కోట్లు, వెనకబడిన ఏడు జిల్లాలకు రూ.750కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి చెప్పారు.14వ ఆర్థిక సంఘం చెప్పినట్లు ప్రత్యేక హోదా అవసరం లేదని తాము భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. హామీలన్నింటినీ అమలు చేస్తున్నప్పుడు ప్రత్యేక హోదా ఎందుకని ప్రశ్నించారు. ఓపక్క కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాపై ఉద్యమం నడపగా, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళన చేసింది. ప్రత్యేక హోదా సాధన సమితి కూడా వివిధ సందర్భాల్లో నిరసన తెలుపుతూ వస్తోంది. ఇక ఇప్పుడు విషయం తేలిపోవడంతో కిం కర్తవ్యమ్ ...

ఇవి కూడా చదవండి:ఆ ఇంట 100 ఏళ్ళ తర్వాత పాపాయి పుట్టింది!

ఇవి కూడా చదవండి:దాని కోసం భార్యని సుత్తితో కొట్టి చంపేసాడు!

English summary

Central Minister in Rajya Sabha Said that There is no need for Sapecial Status for Andhra Pradesh . He said that the BJP Government was giving all the things which Andhra Pradesh Asks and due to this so many members in Rajya Sabha protested on this issue.