ప్రత్యేక హోదా రాదనీ పార్టీ చెప్పేసింది

No Special Status For Andhra Pradesh Says Siddharth Nath Singh

05:34 PM ON 13th May, 2016 By Mirchi Vilas

No Special Status For Andhra Pradesh Says Siddharth Nath Singh

అవును, ఎపికి ప్రత్యేక హోదా రాదనీ , విభజన చట్టంలో లేదని కేంద్రమంత్రులు పార్లమెంట్ లో స్పష్టంచేయగా ఇప్పుడు పార్టీ పరంగా కూడా కమలనాధులు కుండబద్దలు కొట్టినట్లు అదే విషయం చేసారు. అనుకున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. విభజన చట్టంలో ఈ అంశం ప్రస్తావనే లేదని, అందువల్ల ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వలేమని మోడీ సర్కారు ఏపీ రాష్ట్ర బీజేపీ వ్యవహారా ఇన్‌ఛార్జ్ సిద్ధార్ధ్ నాథ్‌ సింగ్‌ ద్వారా శుక్రవారం తేటతెల్లం చేయించింది. అంతేకాదు.. భవిష్యత్‌లో కూడా ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆయన తేల్చి చెప్పారు.

ఇవి కూడా చదవండి:మళ్లీ అదే తప్పు చేస్తున్న పవన్

విజయవాడలో శుక్రవారం జరిగిన బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో సిద్ధార్ధ్ నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ, దేశంలోని 11 రాష్ట్రాలకు ఇప్పటికే ప్రత్యేకహోదా ఉందని, కొత్తగా మరో రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం భవిష్యత్‌లో ఏ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం కదరదన్నారు. కానీ ఏపీని కేటగిరీలో పెట్టడం లేదని, ఏపీకి స్పెషల్ స్టేటస్ లేకపోయినా బీజేపీకి స్పెషల్ స్టేట్ అని ఆయన తెలిపారు. నీతి ఆయోగ్ ద్వారా మరిన్ని నిధులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఇప్పటికే రూ.1.43 లక్షల కోట్ల మేరకు నిధులు ఇచ్చామని, ఈ విషయాన్ని వివరించేందుకు కేంద్ర మంత్రులు ఏపీలో పర్యటిస్తారన్నారు.

కాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు అత్యంత నమ్మకస్థుడని సిద్ధార్ధ్ నాథ్‌ సింగ్‌ చెబుతూ, ఈ అంశంతో తమ మధ్య ఉన్న సంబంధాలు బెడిసికొట్టబోవని కూడా ఆయన స్పష్టంచేశారు. అంతేకాకుండా, ఏపీ సర్కారుతో కలిసి పని చేసేందుకు ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీ అన్ని విషయాలపై చర్చించి తమ దృష్టికి తెస్తుందని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి:కన్యాకుమారికి కొత్త పేరు

ఇవి కూడా చదవండి:విడుదలకు ముందే రికార్డు బ్రేక్ చేసిన కబాలి

English summary

Andhra Pradesh BJP party Incharge Siddardh Nath Singh confirmed that there was no special status for Andhra Pradesh. He says that BJP government will provide all the things which Andhra Pradesh Wanted and Andhra Pradesh Chief Minister Mara Chandra Babu Naidu was their Special Friend.