హోదా కాదు ప్యాకేజీయే...(వీడియో)

No special status only package

06:27 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

No special status only package

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ పెరగడం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంపై మాట్లాడ్డం నేపథ్యంలో కేంద్రంలో కదలిక హెచ్చింది. అయితే హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని కేంద్రం సూచన ప్రాయంగా నిర్ణయించిందని అంటున్నారు. ఈ మేరకు ప్రకటన రావడమే తరువాయి అంటున్నారు.

1/4 Pages

1. ప్యాకేజీయే ఫిక్స్...


ప్రత్యేకహోదా అనే అంశం రాష్ట్రంలో సెంటిమెంట్ గా మారిందని బీజేపీ నేత, విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. హోదాపై తన భార్యను కూడా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. తాజా పరిస్థితులపై పదాధికారుల సమావేశంలో చర్చించామని, త్వరలోనే ఏపీ ప్రజలు మంచి వార్త వినబోతున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ రాజకీయ వ్యూహాలలో దిట్టని, అలాగే తమ వ్యూహాలతో తామూ ముందుకు వెళతామన్నారు. ప్యాకేజీ, హోదాపై చర్చించేందుకు త్వరలో ఢిల్లీకి వెళతామని, తమ వాదనను కూడా వినిపిస్తామని చెప్పారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందించే సాయంలో హోదా పేరు లేకుండా మంచి ప్యాకేజీ ఇవ్వబోతున్నట్లు విష్ణుకుమార్ రాజు చెప్పారు.

English summary

No special status only package