పెద్ద నోట్లు రద్దయ్యాక కాశ్మీర్ లో రాళ్ళ దెబ్బలు ఆగాయట..!

No stones pushing in Kashmir after banning of 500 and 1000 rupees notes

11:23 AM ON 16th November, 2016 By Mirchi Vilas

No stones pushing in Kashmir after banning of 500 and 1000 rupees notes

పెద్ద నోట్ల రద్దుకి, రాళ్లదెబ్బలు ఆగడానికి కారణం ఏమిటబ్బా అనుకుంటున్నారా? అవును నిజం, ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ ఈ విషయం ప్రకటించారు. ఇదే విషయాన్ని మంగళవారం కేంద్ర హోంశాఖ వర్గాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి. పెద్ద నోట్ల రద్దు చేసిన తరువాత కాశ్మీర్ లోయలో రాళ్లు రువ్విన దాఖలాలు కనిపించకుండా పోయాయట. ఇంతకు ముందు రేట్లు కట్టి మరీ ముష్కర మూకలు అల్లర్లు సృష్టించాయి. సైనిక దళాలపై రాళ్లు రువ్వినందుకు రూ.500, మరేదయినా చేసినందుకు రూ.1000 వరకూ ఆశచూపించారు.

తీవ్రవాద చర్యలను ప్రేరేపించే ఇటువంటి టెర్రర్ ఫండ్స్ ప్రధాని మోడీ సున్నాకి తీసుకొచ్చారు అని రక్షణ మంత్రి వెల్లడించారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన అభినందనలు తెలిపారు.

1/4 Pages

సరిహద్దు భద్రత కావచ్చు... ఆర్ధిక భద్రత కావచ్చు... ప్రధాని మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. భద్రత విషయంలో ఎటువంటిదైనా కావచ్చు.. దానికోసం సరిహద్దుల్లో ఉండి మన సైనికులు పోరాడుతున్నారు.. నేను, ప్రధానమంత్రి భద్రతకు భరోసానిస్తున్నామంతే... అని పేర్కొన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్ద తర్వాత కాశ్మీర్ లోయలో హింసాత్మక ఘటనలు గణనీయంగా క్షీణించాయని వెల్లడించింది.

English summary

No stones pushing in Kashmir after banning of 500 and 1000 rupees notes