గ్రేటర్ లో అఖిల్ కి వోటే లేదు         

No Vote For Akhil

11:29 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

No Vote For Akhil

ప్రశాంతంగా కొనసాగుతోన్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ కేంద్రంలో సినీనటుడు అక్కినేని నాగార్జున, అమల దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు నాగార్జున సమాధానం చెబుతూ, అఖిల్‌కు ఓటు లేదని చెప్పారు. .ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉందని నాగార్జున చెబుతూ, అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు ద్వారా మంచి నాయకుడ్ని ఎన్నుకోవాలని సూచించారు. నగరంలో ఈసారి ఓటింగ్‌ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక పోలింగ్‌ కేంద్రం వద్ద నాగార్జునతో సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు.

English summary

Hero Akkineni Nagarjuna and his Wife Amala were voted in Jubliee Hills poling station in Greater Hyderabad Municipal Corporation Elections.Nagarjuna Said That Everyone should have to utilise their vote.He says that there was no vote for his son Akhil