మైక్రోసాఫ్ట్ నుంచి నోకియా 230

Nokia 230 Dual SIM Launched

05:42 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Nokia 230 Dual SIM Launched

ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ 'నోకియా 230' పేరిట ఓ నూతన ఫీచర్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.3,869గా నిర్ణయించింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో దీనిని వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు. అదేవిధంగా డ్యుయల్ సిమ్, ఫ్లాష్‌తో కూడిన 2 మెగాపిక్సల్ ఫ్రంట్, రియర్ కెమెరాలు, 2.8 ఇంచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 240X320 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, బ్లూటూత్ 3.0, మైక్రో యూఎస్‌బీ, జీపీఆర్‌ఎస్/ఎడ్జ్, 3.5 ఎంఎం ఆడియో జాక్, 1200 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఈ ఫోన్ గ్లాసీ బ్లాక్, వైట్ కలర్స్ లో లభ్యమవుతోంది.

English summary

Nokia Mobile Company launched an Internet enabled feature phone called Nokia 230 dual sim . The price of this phone was Rs. 3,869