సరికొత్త స్మార్ట్ ఫోన్ తో నోకియా ...

Nokia is ready new Smart Phone

11:14 AM ON 9th January, 2017 By Mirchi Vilas

Nokia is ready new Smart Phone

అవును ఇది నిజంగా నోకియా అభిమానులకు శుభవార్త లాంటిదే. ఎందుకంటె పోయిన చోటి వెతుక్కోవాలన్న సామెతగా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చతికిలపడి క్రమంగా తన వైభవాన్ని కోల్పోయిన నోకియా ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వచ్చింది. స్మార్ట్ ఫోన్ విఫణిలో కాలుమోపింది. నోకియా బ్రాండ్ ను ఉపయోగించుకునేందుకు హక్కులు సొంతం చేసుకున్న ఫిన్ లాండ్ కు చెందిన హెచ్ఎండీ గ్లోబల్ అనే కంపెనీ తాజాగా ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై పనిచేసే స్మార్ట్ ఫోన్ ను ఆదివారం మార్కెట్లోకి విడుదల చేసింది. చైనా హ్యాండ్ సెట్స్ వాడేవారిని లక్ష్యంగా చేసుకుని దీనిని విడుదల చేసింది.

ఇక దీని ధర 1,699 యువాన్ లు(246 డాలర్లు). 2014 తర్వాత నోకియా బ్రాండ్ పై విడుదలై మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఫొనే ఇదే. మార్కెట్లోకి వచ్చిన తాజా స్మార్ట్ ఫోన్ నోకియా 6 గూగుల్ ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై పనిచేస్తుంది. దీనిని ఫాక్స్ కాన్ తయారుచేసింది. దీనిని ఆన్ లైన్ ద్వారా చైనాలో మాత్రమే విక్రయించనున్నట్టు హెచ్ఎండీ ఆన్ లైన్ రిటైలర్ జేడీ డాట్ కామ్ పేర్కొంది. ఒకప్పుడు సెల్ ఫోన్ ప్రపంచాన్ని ఏలిన నోకియా ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లకు మారడంలో విఫలమవడంతో తన ప్రభను క్రమంగా కోల్పోయింది. అయితే ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే లుమియా ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చినా వినియోగదారులను ఆకట్టుకోలేకపోయింది.

ఇక 2014లో నోకియాను సొంతం చేసుకున్న మైక్రోసాఫ్ట్ నోకియా బ్రాండ్ పై బేసిక్ ఫోన్ల విక్రయాలకే పరిమితమైంది. అలాగే లుమియా ఫోన్లను తీసుకొచ్చింది. అయితే గతేడాది ఈ రెండింటి ఉత్పత్తిని ఆపేసింది. నోకియా బ్రాండ్ పై స్మార్ట్ ఫోన్లు విక్రయించేందుకు గత డిసెంబరులో హెచ్ఎండీ లైసెన్స్ డీల్ కుదుర్చుకుంది. దీని ప్రకారం నోకియా బ్రాండ్ పై అన్ని రకాల మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లను పదేళ్లపాటు విక్రయిస్తుంది. అందులో భాగంగా తొలి ఆండ్రాయిడ్ ఫోన్ ను ఈరోజు విడుదల చేసింది.


ఇది కూడా చదవండి : నెయ్యితో శిరోజాలకు రక్షణ... ఎలాగో తెలుసుకోండి..

ఇది కూడా చదవండి : చర్చిలో మార్మోగిన పంచాక్షరీ మంత్రం

ఇది కూడా చదవండి : న్యూ ఇయర్ వాట్సాప్ మెసేజ్ ల మోత .. సరికొత్త రికార్డ్ క్రియేట్

English summary

Every day new phones were trending in the marketing recently Nokia the popular company was ready with New Smart Phone.