ఇక నోకియా నుంచి ఆండ్రాయిడ్‌ ఫోన్లు

Nokia To Launch Android Smart Phones

04:35 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Nokia To Launch Android Smart Phones

నోకియా.. ఒకప్పుడు మొబైల్ ఫోన్ల మార్కెట్ లో రారాజు. అయితే స్మార్ట్ ఫోన్ల ఆగమనంతో కనుమరుగైపోయింది. ఇంతకు ముందు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మాత్రం ఫోన్లను రూపొందించిన నోకియా తన రూట్ మార్చుకుంది. నోకియా బ్రాండ్‌తో సరికొత్త ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రెండేళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌కు తన వ్యాపారాన్ని అమ్మేసిన నోకియా.. పునరాగమనం చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటనకు అనుగుణంగానే త్వరలోనే ఐఫోన్‌ 6ఎస్‌, హెచ్‌టీసీ ఏ9 ఫోన్లను పోలిన ఆండ్రాయిడ్‌ ఫోన్‌తో మార్కెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నాజూకు పరిమాణం.. అత్యాధునిక ఫీచర్లతో తీసుకొస్తున్నట్లు చెబుతున్న ఈ ఫోన్‌ చిత్రాలను ఓ ఫ్రెంచ్‌ వెబ్‌సైట్‌ తాజాగా వెల్లడించింది. 2015 ఆఖరుకల్లా సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను తీసుకురానున్నట్లు నోకియా సీఈవో రాజీవ్‌ సూరి గతేడాది తెలిపారు. అయితే ఇప్పుడు ఆ గడువు దాటిపోవడంతో ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. నోకియా ఇక ముందు మరిన్ని స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary

Previously Nokia Company CEO Rajeev Suri said that nokia company to launch Nokia Smart Phones Based On Android Operating System.