నోకియా నుండి రానున్న ఆండ్రాయిడ్ C1 మొబైల్ ఫోన్ 

Nokia To Launch Its New C1 Mobile Phone

01:28 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Nokia To Launch Its New C1 Mobile Phone

మొబైల్ ఫోన్ మార్కెట్ ను ఏలిన దిగ్గజ సంస్థ నోకియా కంపెనీ ఒక కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయ్యనున్నట్లు సమాచారం. గత కొద్ది కాలంగా తన మార్కెట్ ను కోల్పోయింది దీంతో ఎలా అయిన మళ్ళి తన పూర్వ వైభవం తెచ్చుకొవడానికి నోకియా అనేక ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగం గా 2016 లో తన కొత్త C1 ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది .


ఈ కొత్త C1 ఫోన్ ను విండోస్,ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం లు కలిగిన రెండు వేరు వేరు మోడళళ్ళలో విడుదల చేయనుంది. ఆండ్రాయిడ్ వెర్షన్ ఫోన్ లో నోకియా సంస్థ యొక్క Z లాంచర్ యూజర్ ఇంటర్ఫేస్ తో విదుదల చేయ్యనుంది. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే 1080 పిక్సెల్స్ ల హై రిజల్యుషన్ కలిగిన 5 ఇంచుల ఫుల్ హెచ్ డి స్క్రీన్ ను ఇందులో పొందుపరిచారు. విండోస్ వేరియంట్ ఫోన్ లో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం ను ,ఆండ్రాయిడ్ వేరియంట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ మార్ష్ మెలో 6.0 వెర్షన్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ రానున్నట్టు సమాచారం . 2 జీబి రామ్ , వెనుక భాగం లో 8 మెగా పిక్సెల్స్ కెమెరా , ముందు భాగంలో 5 మెగా పిక్సెల్స్ కెమెరాలు ఈ C1 ఫోన్లో ఇమిడి ఉన్నాయి. పింక్ , గ్రే , వైట్ , గోల్డ్ వంటి వివిధ రంగులతో ఈ ఫోన్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫోన్ ను సొంతం చేసుకోవాలంటే మాత్రం 2016 వరకు ఆగాల్సిందే .

English summary

Mobile Company Giant Nokia to launch its new smart phone C1 in 2016. Its new Mobile C1 is to be released in two variants like C1 phone with windows operating system and Another with Andriod Operating system