నోకియా యూనిట్ పునః ప్రారంభానికి కసరత్తు 

Nokia To Restart Tamilnadu Unit

11:26 AM ON 8th February, 2016 By Mirchi Vilas

Nokia To Restart Tamilnadu Unit

తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌ సమీపంలో ఏర్పాటైన నోకియా మొబైల్‌ఫోన్‌ యూనిట్‌ గత సంవత్సరం మొదట్లో మూతపడిన నోకియా మొబైల్‌ఫోన్‌ యూనిట్‌ను పునఃప్రారంభించే దిశగా చర్యలు ఊపందుకున్నాయి. .కేంద్ర ప్రభుత్వం నాలుగు శాఖల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం అయిదు పరిశ్రమల ప్రతినిధుల బృందంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి యూనిట్‌ పునఃప్రారంభానికి చర్యలు చేపట్టాలని సూచించింది. యూనిట్‌ ప్రారంభానికి అవసరమైన రూ.250 కోట్లను ప్రభుత్వం రుణంగా అందించాలని, యూనిట్‌ ప్రారంభమైన తర్వాత దానిని వేరొక సంస్థకు బదలాయించాలని, ఈ సందర్భంగా అవసరమైన పనులను తమిళనాడు ప్రభుత్వం చేపట్టాలని పేర్కొంది. కార్మిక సంఘాలతో దీనిపై చర్చించాలని కూడా తెలిపింది. పదేళ్లకు విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) మినహాయింపును రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కమిటీ సూచించింది.

ప్రత్యేక కమిటీ సభ్యులు రూపొందించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి అందించిన నేపథ్యంలో అతిత్వరలో ఈ యూనిట్‌ నుంచి ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలు నెలకొన్నాయి. యూనిట్ మూతపడిన కారణంగా పలువురు వీధినపడిన విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన పన్ను బకాయిల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పునఃప్రారంభించడానికి చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వచ్చాయి.. అదే సమయంలో దేశంలో మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినకమిటీ, నోకియా యూనిట్‌ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇండియన్‌ సెల్యులర్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు పంకజ్‌ మహింద్రు, అధికారులతో కూడిన ఈ బృందం జనవరిలో తమిళనాడుకు చేరుకుని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి తంగమణి, ఉన్నతాధికారులతో సమాలోచన నిర్వహించింది. ఆ తర్వాత నోకియా ప్లాంట్‌ పునఃప్రారంభం నిమిత్తం సిద్ధం చేసిన నివేదికను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీకి అందించింది. ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే నోకియా యూనిట్‌ పునఃప్రారంభానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటారు.

English summary

Tamil Nadu-based Nokia plant, which was shut down few months back, is likely to start functioning again, Prime Minister Narendra Modi indicated today.