పాపం విజయసాయి...

Non Bailable Arrest Warrant Against Vijay Sai Reddy

06:26 PM ON 4th June, 2016 By Mirchi Vilas

Non Bailable Arrest Warrant Against Vijay Sai Reddy

టిడిపి నాలుగో అభ్యర్ధిని రంగంలో దింపితే, ఇబ్బందులు తప్పవే కాదు. కానీ ఎందుకో టిడిపి వెనక్కి తగ్గడంతో రాజ్యసభకు ఏకగ్రీవంగా నెగ్గి, పెద్దల సభలో అడుగుపెట్టేందుకు రెడీగా వున్న వైసీపీ నేత విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు ఝలక్ ఇచ్చింది. ఆయనకు సీబీఐ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా అన్ని కేసుల్లో సాయిరెడ్డి నిందితుడిగా ఉన్న సంగతి తెల్సిందే. రెగ్యులర్‌గా ఈ కేసుల పై నాంపల్లిలోని సీబీఐ కోర్టు ప్రతి శుక్రవారం విచారణ జరుపుతోంది.

ఈ విచారణకు విజయసాయి వరసగా హాజరుకాకపోవడంతో ఆయనకు సీబీఐ కోర్టు న్యాయమూర్తి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. అనారోగ్యం కారణంగా విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు విజయసాయి పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు దీన్ని తిరస్కరించింది. దీనిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేసినట్టు చెబుతున్నారు. తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా పడింది. మొత్తానికి దీన్నుంచి ఎలా బయట పడాలా అని కసరత్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:త్రివిక్రమ్ కాపీ కొట్టి తీసిన సినిమాలు ఇవే!
ఇవి కూడా చదవండి:జూన్ నెలలో పుట్టిన వారి విశిష్ట లక్షణాలు

English summary

Nampally CBI Court Issued Non Bailable Arrest Warrant Against Vijay Sai Reddy