ఉత్తర కొరియాలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లపై బ్యాన్

North Korea Bans Facebook Twitter And YouTube

10:21 AM ON 2nd April, 2016 By Mirchi Vilas

North Korea Bans Facebook Twitter And YouTube

సోషల్ మీడియాలో అగ్రగామిగా దూసుకుపోతున్న ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లు కొన్ని దేశాల్లో బ్రేకులు పడుతున్నాయి. తాజాగా ఉత్తరకొరియా దేశంలో దక్షిణ కొరియా వెబ్‌సైట్లతో పాటు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ తదితర సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్ల పై బ్యాన్ విధించారు. ఈమేరకు ఈ మేరకు అక్కడి ప్రభుత్వ మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ కోర్యోలింక్‌ ద్వారా మినిస్ట్రీ ఆఫ్‌ పోస్ట్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ప్రకటించింది. సోషల్‌మీడియా ద్వారా ఆన్‌లైన్‌ సమాచారం విపరీతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవి కుడా చదవండి:పవన్ నిర్మాతకు జైలు శిక్ష

ఇప్పటికే ఉత్తర కొరియాలో ఇంటర్నెట్‌ సదుపాయం చాలా తక్కువగా ఉంటుంది. విదేశీయులకు మాత్రం గతంలో ఇంటర్నెట్‌పై నిబంధనలు ఉండేవి కావు. కొత్త ఆంక్షలతో వారికి కూడా నిబంధనలు కఠినమయ్యాయి. కొంత కాలం వరకు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌, ద.కొరియా మీడియా సైట్లు నిషేధిస్తున్నామని, అక్రమంగా ఉపయోగించే ప్రయత్నం చేయొద్దని స్పష్టం చేసింది.

ఇవి కుడా చదవండి:

ఇండస్ర్టీకి గుడ్ బై కొట్టేస్తోందా ....

'చిన్నారి పెళ్ళికూతురు' ఆనంది ఆత్మహత్య

బిచ్చగాడికి లాటరీ.. రూ. 65 లక్షలు జాక్ పాట్

English summary

North Korea Government has Announced that the sites like Facebook,Twitter,YouTube and Some of the South Korea Websites in North Korea.