ఉత్తర కొరియా దగ్గర హైడ్రోజన్ బాంబు

North Korea Owns Hydrogen Bombs

04:18 PM ON 11th December, 2015 By Mirchi Vilas

North Korea Owns Hydrogen Bombs

ఉత్తర కొరియా దగ్గర అణుబాంబు కన్నా వందరెట్లు శక్తివంతమైన హైడ్రోజన్ బాంబు ఉందట. ఈ విషయాన్ని ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ ఇటీవల బహిరంగంగా ప్రకటించారు. దక్షిణ కొరియా, అమెరికాలకు సవాల్ విసురుతున్న ఉత్తర కొరియా తాజా ప్రకటన ప్రపంచ దేశాల్లో కలవరం రేపుతోంది. గతంలో అనేక సార్లు ఉత్తర కొరియా అణుబాంబు పరీక్షలను నిర్వహించింది. యురేనియం మూలకంతో పాటు ప్లుటోనియంతో ఉత్తర కొరియా అణు బాంబుల తయారీకి గతంలో ప్రయత్నం చేసింది. అయితే అణుశక్తి రంగంలోఉత్తర కొరియా ప్రగతి నమ్మశక్యంగా లేదని అమెరికా భావిస్తోంది. మరో వైపు ఉత్తర కొరియా అధినేత వ్యాఖ్యలను ఐక్యరాజ్యసమితి సమీక్షిస్తోంది. ఆ దేశ తీరును అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది. కాగా.. కిమ్ నేతృత్వంలో ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు తయారీ కోసం ప్రయత్నిస్తున్న విషయం వాస్తవమే అయినా.. ఆ బాంబును రూపొందించే టెక్నాలజీ దాని దగ్గర లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

English summary

North Korea President Kim Jang Vun says that the scontry own s hydrogen bombsa which were more powerful than atom bombs