హెచ్ బాంబు పేలింది..

North Korea's hydrogen bomb test

06:09 PM ON 6th January, 2016 By Mirchi Vilas

North Korea's hydrogen bomb test

హైడ్రోజన్ బాంబు.. అణు బాంబు కన్నా వందరెట్లు శక్తివంతమైనది. దీని గురించి మాట్లాడటానికే చాలా దేశాలు భయపడుతుంటాయి. అలాంటిది.. హైడ్రోజన్ బాంబును ఉత్తర కొరియా విజయవంతంగా పరీక్షించేసింది. ఆ దేశ ఈశాన్య ప్రాంతంలో ఉన్న పంగేయిరి అణు పరీక్ష కేంద్రంలో హైడ్రోజన్ బాంబును శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఈ సమయంలో ఆ ప్రాంతంలో 5.1 తీవ్రతతో భూ ప్రకపంనలు చోటుచేసుకున్నాయి. పంగేయిరి ప్రాంతంలో 2006 నుంచి ఉత్తర కొరియా ఇప్పటి వరకు మూడు సార్లు అండర్‌గ్రౌండ్ అణు పరీక్షలు నిర్వహించింది. అణు బాంబు కన్నా ఎన్నో రేట్లు శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును ఫ్యూజన్ పద్ధతిలో పేలుస్తారు. అలా పేల్చడం వల్ల బ్రహ్మండం బద్దలు అయ్యే అంత శక్తి విడుదలవుతుంది. గతంలో చేపట్టిన పరీక్షల ఆధారంగా ఉత్తర కొరియా తాజాగా హైడ్రోజన్ బాంబును పరీక్షించింది. దీని కోసం విధ్వంసకర ఫ్ల్యూటోనియంను వాడినట్లు సమాచారం. తేలికగా ఉండే ఫ్ల్యూటోనియం వల్ల అత్యంత భయంకరమైన శక్తి విడుదలవుతుంది. మొదట హైడ్రోజన్ బాంబు పరీక్షకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. అయితే ఆ దేశ ఈశాన్య ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ పేర్కొంది. కిల్జూ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఇది భూకంపం కాదు హైడ్రోజన్ బాంబు పేలుడు అని తేల్చారు. ఈ నెల 3వ తేదీన ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ హైడ్రోజన్ బాంబు పరీక్షకు ఆదేశాలు జారీ చేశారు. అమెరికా ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబును పరీక్షించినట్లు తెలుస్తోంది. శత్రు దేశాల సైనిక సత్తాను ఎదుర్కోవాలంటే అణు బాంబులే తమ ఆధారమని కిమ్ జాంగ్ గతంలో ప్రకటించారు. ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రకారం జనవరి 6వ తేదీ.. ఉదయం 10 గంటలకు హైడ్రోజన్ బాంబును పేల్చారు. కాగా, హైడ్రోజన్ బాంబు పరీక్ష ప్రాంతంలో ఎటువంటి వాయువులు విడుదల అయ్యాయో తెలుసుకునేందుకు కొన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు పరీక్షపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అమెరికా, దక్షిణ కొరియా, చైనా, జపాన్ ఈ బాంబు పరీక్షను తీవ్రంగా ఖండించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

హైడ్రోజన్ బాంబు అంటే..

హైడ్రోజన్ బాంబును అమెరికా శాస్త్రవేత్తలు 1958లో అభివృద్ధి చేశారు. అణు విచ్ఛితి ద్వారా హైడ్రోజన్ ఐసోటోప్‌లు అపరిమిత శక్తిని విడుదల చేస్తాయి. దీన్ని థర్మో న్యూక్లియర్ బాంబు అని కూడా పిలుస్తారు. అణు బాంబు కన్నా హైడ్రోజన్ బాంబు చాలా స్వచ్ఛమైందని గుర్తిస్తారు. ఎందుకంటే అణు బాంబు కన్నా హైడ్రోజన్ బాంబు వల్ల అణుధార్మికత తక్కువగా విడుదలవుతుంది. కానీ ఆ బాంబు కంటే ఎన్నో రేట్లు హైడ్రోజన్ బాంబు శక్తివంతమైంది.

English summary

UN Security Council meets to discuss the world's response as leaders urge for "strong action" to be taken against Pyongyang following Hydrogen bomb test which caused 5.1 magnitude earthquake