కొరియా కొత్త ఆపరేటింగ్ సిస్టం! 

North Korea's New Red Star Operating System

05:51 PM ON 30th December, 2015 By Mirchi Vilas

North Korea's New Red Star Operating System

విండోస్, ఉబుంటూ, లైనక్స్, యాపిల్ ఓఎస్ ఎక్స్.. ఇవన్నీ మనకు తెలిసిన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అమెరికా అగ్ర సంస్థలకు చెందిన ఈ ఆపరేటింగ్‌ సిస్టంలకు ధీటుగా సొంత ఓఎస్‌ను తీసుకొచ్చేందుకు ఇప్పుడు ఉత్తర కొరియా ప్రయత్నిస్తోంది. మూడు నెలల క్రితం చైనా కైలిన్‌ పేరుతో విండోస్‌ ఎక్స్‌పీని పోలిన ఆపరేటింగ్‌ సిస్టంను తీసుకురాగా.. తాజాగా రెడ్‌ స్టార్‌ పేరుతో యాపిల్‌ ఓఎస్‌ ఎక్స్‌ను పోలిన ఓఎస్‌ను ఉత్తర కొరియా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇప్పటి వరకూ బయటికి అధికారికంగా విడుదల చేసినట్లు ప్రకటించకపోయినా.. ఇప్పటికే ఉత్తర కొరియా వ్యాప్తంగా అధిక శాతం కంప్యూటర్లు రెడ్‌ స్టార్‌ ఓఎస్ తోనే పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. ఫీచర్ల విషయంలో దాదాపు యాపిల్‌ ఓఎస్‌ను పోలి ఉన్న రెడ్‌ స్టార్‌లో.. ఫైల్‌ షేరింగ్‌, ఆడియో, వీడియోలకు సంబంధించిన సరికొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇది పూర్తిగా కొరియన్‌ భాషలోనే అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. ఫైర్‌ఫాక్స్‌లోని ఫీచర్లతో ఓ ప్రత్యేక వెబ్‌ బ్రౌజర్‌ ఈ ఆపరేటింగ్‌ సిస్టంలో ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు.

అయితే వినియోగదారుల భద్రతపరంగా ఈ ఆపరేటింగ్‌ సిస్టంలో లోపాలున్నట్లు నిపుణులు గుర్తించారు. అక్కడి ప్రజలపై ప్రభుత్వం నిఘా ఉంచేందుకు ఈ ఓఎస్‌ను వినియోగించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

English summary

North Korea Country was developing its new operating system Called "RED STAR"