గ్రేటర్ నగారా మోగనుంది?

Notification To GHMC Elections

01:00 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Notification To GHMC Elections

తెలంగాణాలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎంఎల్సి ఎన్నికల సందడి వేడెక్కిన నేపధ్యంలో మరో పక్క హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు కూడా ముహూర్తం కూడా సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. జనవరి మూడవ వారంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టుకు తెలిపింది. అంటే సంక్తాంతి పండగ నేపధ్యంగా జవనరి 17న పోలింగ్ జరిపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు కొన్ని పత్రికల్లో కధనాలు కూడా వచ్చాయి. దీనికి తోడు భాగ్యనగరమంతా నిలువెత్తు గులాబీ రంగు ఫ్లెక్సీ లు కూడా కనిపిస్తుంటే, ఇదంతా ఎన్నికల తతంగం కోసమేనని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.

బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జరుగుతున్న సర్వే ప్రక్రియ మరో పది రోజుల్లో ముగియనున్నదని సమాచారం. ఎన్నికల నిర్వహణకు సంబం ధించి ఇప్పటికే డివిజన్లవారీగా అధికారులు సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. పోలింగ్ కు సంబంధించి అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) లను ఎన్నికల సంఘం సమకూర్చుకునే పనిలో నిమగ్నమై ఉంది. ఇప్పటికే ఈవీఎంల కొనుగోలుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది.

జనవరి తొలి వారంలో ఈవీఎంలను సిద్ధం చేసి అందు బాటులో ఉంచుతామని ఈసీఐఎల్ ఉన్నతాధికారులు ఎన్నికల సంఘానికి హామీ ఇచ్చారట. అందుకే ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. ఫిబ్రవరి ఆ తర్వాత ఎన్నికలు జరిగితే ప్రయోజనం ఉండదని ఇప్పటికే నగర ప్రజలు దాహర్తితో అల్లాడుతున్నారని, ఎండాకాలం ప్రవేశిస్తే , తాగునీటి ఇబ్బందులు , తమకు వ్యతిరేక ప్రభావం చూపిస్తాయని టి ఆర్ ఎస్ భావిస్తోంది. అందుకే అప్పటిదాకా వేచి ఉండకుండా జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.

ఇక ప్రతిపక్షాలన్నీ ఊహిస్తున్నట్లుగానే సంక్రాంతి పండుగ సమయంలోనే గ్రేటర్ ఎన్నికలకు ముహూర్తం పెట్టినట్లుగా సమాచారం. జనవరి 17న జీహెచ్ ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని... అందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓకే చెప్పిందని సమాచారం. ఒకట్రెండు రోజుల్లో దీనిపై ఎన్నికల సంఘం ప్రకటన చేయబోతోందన్న సంకేతాలు వెఉవదుతున్నాయి.

వరంగల్ లోకసభ ఉప ఎన్నిక లో ప్రతిపక్షాలకు డిపాజిట్ లేకుండా చేసి , అనూహ్య విజయాన్ని నమోదు చేసుకున్న టి ఆర్ ఎస్ ప్రస్తుత స్థానిక సంస్థల ఎనికలలో కూడా వీలైనన్ని సీట్లు ఎగరేసుకుపోవడానికి వ్యూహం రచిస్తోంది. కొత్త సంవత్సరంలో అదికూడా సంక్రాంతి కానుకగా గ్రేటర్ ఫలితాలను టి ఆర్ ఎస్ శ్రేణులకు అందించి నిజమైన సంక్రాంతి టి ఆర్ ఎస్ శ్రేనుల్ల్లో నింపాలని ఆపార్టీ పధకం వేస్తోంది. ఎం ఎల్ సి ఎన్నికల తర్వాత ఆపరేషన్ ఆకర్శ్ కి పదును పెట్టడం ద్వారా ప్రత్యర్ధి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేసే దిశగా టి ఆర్ ఎస్ పావులు కదుపుతోంద నడంలోసందేహం లేదు.

English summary

Greater hyderabad municipal corporation (GHMC) election notification has released.Election commisiion has started the election process