ప్రపంచాన్ని భయపెడుతున్న 'నవంబర్-15'.. ఇంతకీ కారణం ఏమిటి?

November 15th is the most dangerous day for world

05:18 PM ON 27th October, 2016 By Mirchi Vilas

November 15th is the most dangerous day for world

ఆమధ్య కంప్యూటర్లన్నీ(2కె) ఆగిపోతాయంటే, ప్రపంచమంతటా అదోరకమైన భయం ఆవహించింది. ఇక మొన్నటి వరకు భూమి అంతమవుతుందన్నారు.. ఇప్పుడు ఏకంగా ఓ డేట్ ఈ ప్రపంచాన్ని భయపెడుతోందట. అయితే ఆ డేట్ పేరిట ప్రపంచాన్నే భయపెడ్తున్నారట. ఇలా రెండు వాదనలు విన్పిస్తున్నాయి. ఇంతకీ ఆ డేట్ ఏమిటంటే, నవంబర్ 15. భయపడుతున్నా, భయపెడుతున్నా దీనర్ధం ఇంచుమించు ఒకటే కదా. అందుకే అన్నారు పెద్దలు, మూతిపళ్లు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏంటని? ఎలాగైనా మానవులను భయపెట్టడమే వారి అంతిమ లక్ష్యం. ఇప్పుడు 15 రోజుల పాటు సూర్య కాంతి భూమిపై పడబోదంటున్నారు.

సాక్షాత్తూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాసా(అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ) పేరుతో వైరల్ అవుతున్న ఓ వార్త ఇప్పుడు భూదేవిని నమ్ముకున్న మానవాళిని కలవరపాటుకు గురిచేస్తోంది. నవంబర్ లో పక్షం పాటు భూమిని చీకట్లు కమ్మేస్తాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతకీ ఇదెలా బయటకు వచ్చిందంటే, నవంబర్ 15 నుంచి 29 వరకు భూమి చీకటిమయం అవుతుందని, దీనికి సంబంధించిన సమాచారంపై అమెరికా అధ్యక్షుడు ఒబామాకు నాసా చీఫ్ వెయ్యి పేజీల రిపోర్టును కూడా సమర్పించాడని ది బోర్డ్ మైండ్ వెబ్ సైట్ 8 రోజుల క్రితం ఓ కథనం ప్రచురించింది.

ఈ ఏడాది నవంబర్ 15 నుంచి 30 వరకూ పదిహేను రోజుల పాటు భూమి చీకట్లోకి వెళుతుందని ఆ వెబ్ సైట్ కథనం. నాసా సైంటిస్టులు ఈ విషయాన్ని చెప్పారని ఆ వెబ్ సైట్ ప్రచురించింది. నవంబర్ బ్లాక్ అవుట్ గా పిలిచే ఈ ఉత్పాతము నవంబర్ 15వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం 4.45 వరకూ ఉంటుందని పేర్కొంది.

1/5 Pages

ఆరోజు నిజంగా ఏం జరుగుతుంది?


సౌర వ్యవస్థలో శుక్ర గ్రహం, గురు గ్రహాల మధ్య జరిగే ఖగోళ పరిణామాల వల్లే ఈ బ్లాకవుట్ సంభవిస్తుందని శాస్త్రవేత్తలు ఓ స్పష్టతకు వచ్చారట. శుక్రుడు, గురుడు పరస్పరం చాలా దగ్గరగా వస్తాయని, అప్పుడు వాటిమధ్య ధ్రుక్కోణం కేవలం ఒక డిగ్రీ మాత్రమే ఉంటుందని, ఈ సమయంలో గురుగ్రహం నైరుతి దిశగా శుక్రుడు అధిగమించి గురుడి కన్నా పది రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా మారుతాడట.

English summary

November 15th is the most dangerous day for world