'గబ్బర్‌' కంటే సర్దార్‌లో కామెడీ ఎక్కువట

Now comedy scenes shooting for Sardar Gabbar Singh

01:31 PM ON 13th February, 2016 By Mirchi Vilas

Now comedy scenes shooting for Sardar Gabbar Singh

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న మోస్ట ప్రెస్టీజియస్‌ మూవీ 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌'. 'పవర్‌' ఫేమ్‌ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, రాయ్‌లక్ష్మీ, సంజన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 8న ఎటువంటి ఆటంకం లేకుండా విడుదల చెయ్యడానికి శరవేగంగా షూటింగ్‌ జరుపుతున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీమ్‌ కేరళ వెళ్ళిన విషయం తెలిసిందే. అక్కడ పవన్‌-కాజల్‌ పై ఒక పాటని చిత్రీకరించారట. ఇది అయిపోయిన వెంటనే హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుతున్నారు. ఇక్కడ మొత్తం కామెడీ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారట. 'గబ్బర్‌ సింగ్‌' సినిమా లో కంటే ఇందులో అదిరిపోయే కామెడీ ఉంటుందట. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శరత్‌ మరార్‌ నిర్మిస్తున్నారు.

English summary

Comedy scenes shooting for Sardar Gabbar Singh set in Hyderabad. Pawan Kalyan and Kajal Agarwal were romancing in this movie. Power fame Bobby is directing this movie.