నిన్న బాలయ్య అభిమాని .. నేడు పవర్ స్టార్ కి జై

Now Nani Become Power Star Pawan Kalyan Fan

10:54 AM ON 16th June, 2016 By Mirchi Vilas

Now Nani Become Power Star Pawan Kalyan Fan

అవునా అంటే అవుననే అంటున్నారు. ఇంతకీ ఎవరంటే, టాలీవుడ్లో గతేడాది నుంచి వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో నానియే. ఎవడే సుబ్రహ్మణ్యం - జెండా పైకపిరాజు - భలే భలే మగాడివోయ్ - కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాల తర్వాత నాని మార్కెట్ డబుల్ రేంజ్ కి చేరింది. ఇక ఈ యేడాది ఇప్పటికే కృష్ణగాడి సినిమాతో హిట్ కొట్టి ఈ శుక్రవారం ఒకప్పటి బ్లాక్ బస్టర్ టైటిల్ జెంటిల్ మేన్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

కృష్ణగాడి సినిమాలో బాలయ్య అభిమానిగా కనిపించి మెప్పించిన నాని ఇప్పుడు పవర్ స్టార్ అభిమానిగా అవతారం ఎత్తాడట. కృష్ణగాడి సినిమాలో చేతి మీద జై బాలయ్య టాటూతో కనిపించిన నాని నందమూరి అభిమానులను బానే ఎట్రాక్ట్ చేశాడు. ఇక నందమూరి అభిమానులంతా నాని సినిమాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. జెంటిల్ మేన్ తర్వాత ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమాలో నాని నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా నాని కనిపిస్తాడట. ఇప్పటికే యంగ్ హీరో నితిన్ రియల్ లైఫ్ లో పవన్ వీరాభిమానిగా పాపులర్ అయ్యి పవన్ ఫ్యాన్స్ ను బానే వాడుకుంటున్నాడు. ఇక ఇప్పుడు నాని రీల్ లైఫ్ లో పవన్ అభిమాని అవతారం ఎత్తనున్న నాని సినిమాకు పవన్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి మరి. ఇక బాలయ్య అభిమానుల సపోర్ట్ హుష్ కాకేనా?

ఇది కూడా చూడండి: మన తెలుగు రాష్ట్రాల చిహ్నాల గురించి మీకు తెలుసా?

ఇది కూడా చూడండి: సన్నీలియోన్ గురించి మీకు తెలియని విషయాలు

ఇది కూడా చూడండి: ఆమె ఇంట్లో బయట పడ్డ రహస్య గది

English summary

Now Nani Become Power Star Pawan Kalyan Fan.