ఇకపై డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ అవసరం లేదు

Now no need to carry driving lisence and rc book

10:32 AM ON 8th September, 2016 By Mirchi Vilas

Now no need to carry driving lisence and rc book

రవాణా శాఖ ఓ కొత్త శుభవార్త మోసుకొచ్చింది. ఇన్నాళ్లూ వాహనాన్ని బయటికి తీసుకెళ్ళే ముందు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్సీ) నకలు కాపీలు మన వెంట కచ్చితంగా ఉండి తీరాల్సిందే. లేకపోతే పోలీసులతో చీవాట్లు తినడం, జరిమానాతో చేతి చమురు వదిలించుకోవడం చాలామందికి జరుగుతోంది. అయితే ఇక ఆ అవసరం లేకుండా కేవలం యాప్ సహాయంతో బయటికి హాయిగా వెళ్ళవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం డిజీ లాకర్ యాప్ ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా ఏ ప్రాంతం నుంచి అయినా మొబైల్ ను ఉపయోగించి డీఎల్, ఆర్సీలను చూసుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు, ఇతర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు యాప్ ద్వారా వ్యక్తుల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

ఆధార్ కార్డు నంబర్ ను, మొబైల్ నంబర్ తో లింక్ చేసి డిజీ లాకర్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. కేవలం డిజీ లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న వివరాలు పోలీసులకు చూపిస్తే సరిపోతుంది. అంతే కాదు తప్పుడు వివరాలు నమోదు చేసే అవకాశం ఇందులో ఉండనే ఉండదట. కేవలం మన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ నంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా వివరాలు చూపిస్తాయి. వాటిని సేవ్ చేసుకుంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చట. ఇతరులకు షేర్ కూడా చేయవచ్చు. కొంత కాలం క్రితం తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి యాప్ నే ప్రవేశపెట్టింది. ఇప్పుడు దేశం అంతటా ఒకే యాప్ రాబోతోంది.

ఇది కూడా చదవండి: ఏకైక నరముఖ వినాయక దేవాలయం ప్రపంచంలో ఎక్కడుందో తెలుసా?

ఇది కూడా చదవండి: మీరు చేసే వ్యాపారం బట్టి మీరు ఏ రంగు పర్స్ వాడితే మంచిదో తెలుసా?

ఇది కూడా చదవండి: కలలో ఈ జంతువులు వస్తే మీకు ఏం జరుగుతుందో తెలుసా?

English summary

Now no need to carry driving lisence and rc book