7 భారతీయ భాషల్లో క్వికర్

Now Quikr Available In 7 Indian Languages

03:58 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Now Quikr Available In 7 Indian Languages

సెకండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకం, కొనుగోళ్ల పోర్టల్‌ క్వికర్ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తెలుగుతో పాటు 7 భారతీయ భాషల్లో యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. క్వికర్ తన వెబ్‌సైట్‌లో చేసిన ఈ మార్పులు డెస్క్‌టాప్, మొబైల్ వెర్షన్లు రెండింటిలోనూ లభ్యమవుతున్నాయి. దీంతో ఇప్పుడు వినియోగదారులు ఇంగ్లిష్‌తోపాటు హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, గుజరాతీ, మరాఠీ వంటి భాషల్లోనూ యాడ్స్‌ను చూడవచ్చు, పోస్ట్ చేయవచ్చు. దేశంలో అధిక శాతం మంది నాన్ఇంగ్లిష్ స్పీకింగ్ ప్రజలే ఉన్నారని, ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ వినియోగదారులకు మరింత చేరవయ్యేందుకు ఈ భాషా సౌలభ్యాన్ని ప్రవేశపెట్టామని క్వికర్ ప్రతినిధులు చెబుతున్నారు. నేటి ఆధునిక యుగంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవలు విస్తృతమవుతున్నాయని, అక్కడి ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకే ప్రాంతీయ భాషల్లోనూ తమ వెబ్‌సైట్ సేవలను అందిస్తున్నట్టు తెలిపారు. ఇటీవలే స్నాప్ డీల్ కూడా పలు భారతీయ భాషల్లో తన యాప్ ను అప్ డేట్ చేసిన సంగతి తెలిసిందే.

English summary

India's famous online classifieds website Quikr has announced support for seven Indian languages like Hindi, Tamil, Telugu, Kannada, Malayalam, Gujarati, and Marathi