పెళ్లి కాని జంటలకు కూడా ఆ హోటల్ లో రూమ్స్ ఇస్తారట.. ఎక్కడో తెలుసా?

Now unmarried couples can also book rooms in Oyo hotel

12:44 PM ON 27th August, 2016 By Mirchi Vilas

Now unmarried couples can also book rooms in Oyo hotel

ఇప్పటివరకూ ఆ హోటల్స్ లో వున్న ఆంక్షలు ఎత్తేసారు. దీంతో పెళ్లికాని జంటలకు శుభవార్త అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ లెక్కన ఇకనుంచి పెళ్లికాని జంటలు కూడా ఓయోసంస్థ హోటళ్లలో గదులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. అవివాహిత యువతీ, యువకులను ఆకట్టుకునేందుకు వీలుగా రెండు నెలల క్రితం సరికొత్త విధానాన్ని ఓయో హోటళ్లలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. అది సత్ఫలితాలు ఇవ్వడంతో పలు ఇతర నగరాల్లో అవివాహితులకు హోటల్ గదులను అందుబాటులోకి తీసుకువచ్చారు. స్థానిక గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది... ఆ హోటల్ గదుల్లో దర్జాగా గడపవచ్చని ఓయో సంస్థ ప్రకటించింది.

దేశంలోని 200 నగరాల్లో 70,000 గదులుండగా వీటిలో 60 శాతం గదులను అవివాహితులకు ఇవ్వాలని నిర్ణయించారు. వంద మెట్రో నగరాల్లో కపూల్ ఫ్రెండ్లీ రూమ్స్ ప్రారంభించారు. తమ ఖాతాదారుల్లో 18నుంచి 30 ఏళ్ల మధ్య వారే ఎక్కువగా ఉన్నారని, వారికి మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఓయో సంస్థ ప్రకటించింది. దీంతో పెళ్లి కాని జంటలు ఓయో గదుల బుకింగ్ కోసం ఎగబడుతున్నారట. ఇక ఎందుకు ఆలస్యం ఎంచక్కా ఎంజాయ్ చేయండి.

ఇది కూడా చదవండి: ప్రిన్స్ కోసం ఆ స్టార్ హీరోకి నో చెప్పేసింది...

ఇది కూడా చదవండి: 92 పైసల ప్రీమియం ... 10 లక్షల బీమా ...

ఇది కూడా చదవండి: శ్రీవారి దర్శనం రెండోసారి కూడా...(ఫోటోలు)

English summary

Now unmarried couples can also book rooms in Oyo hotel.