ఐసీఐసీఐ సైట్ లో రైలు టికెట్లు

Now We can Book Rail Tickets From ICICI Website Only

02:55 PM ON 24th December, 2015 By Mirchi Vilas

Now We can Book Rail Tickets From ICICI Website Only

ఇకపై రైలు టికెట్ల కోసం ఐఆర్ సీటీసీ సైట్ కోసం కష్టాలు పడక్కర్లేదు. బ్యాకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ త్వరలోనే రైల్వే టికెట్ల అమ్మకం ప్రారంభించనుంది. ఈ మేరకు రైల్వే ఈటికెట్‌ ప్లాట్‌ఫాంతో ఐసీఐసీఐ ఒప్పందం కుదర్చుకుంది. దీంతో బ్యాంక్‌ వెబ్‌సైట్లో రైల్వే టికెట్‌ బుకింగ్‌ సదుపాయం అందుబాటులోకి రానుంది. బ్యాంకు మొబైల్‌ యాప్‌, ప్రీపేడ్‌ డిజిటల్‌ వాలెట్‌ ద్వారా కూడా రైలు టికెట్లను బుక్‌ చేసుకునే సౌకర్యం కల్పించనున్నట్లు ఐసీఐసీఐ తెలిపింది. ఐఆర్‌సీటీసీలో రిజిస్టర్‌ అయిన యూజర్లు బ్యాంక్‌ వెబ్‌సైట్‌ ద్వారా వన్‌టైం రిజిస్ట్రేషన్‌ చేసుకుని టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. అయితే ఈ సదుపాయాన్ని ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకే పరిమితం చేయలేదని, ఏ బ్యాంకు ఖాతా ద్వారా అయినా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చని ఐసీఐసీఐ వెల్లడించింది.

English summary

ICICI Bank now launching new service. Now we can book rail tickets from ICICI website only in association with IRCTC.