నోట్ల కష్టాల్లో కొత్త చిట్కా - రైల్వే ప్రయాణికులకు శుభ వార్త

Now We Can Buy Railway Tickets At ATVM Through ATM Card

01:03 PM ON 28th November, 2016 By Mirchi Vilas

Now We Can Buy Railway Tickets At ATVM Through ATM Card

పెద్ద నోట్లు రద్దు చేయడం, అనుకున్న నోట్లు సకాలంలో అందుబాటులోకి రాకపోవడం నేపథ్యంలో కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. కేష్ లెస్ లావాదేవీలపై జోరుగా ప్రచారం చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక నోట్ల రద్దుతో ఇక్కట్లు ఎదుర్కొంటున్న ప్రయాణికుల కష్టాలు తీర్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. రైల్వే టికెట్లను జారీచేసే ఏటీవీఎమ్ మిషన్లకు ఏటీఎంలను అనుసంధానం చేయాలని భావిస్తోంది.

ఇప్పటిదాకా డబ్బులిస్తేనే ఏటీవీఎమ్ మిషన్లు టికెట్లు ఇచ్చేవి. అయితే ఇక నుంచి కార్డుల ద్వారా టికెట్ చార్జీలు వసూలు చేసి, టికెట్లు ఇవ్వనున్నాయి. ఈ ప్రక్రియ ద్వారా రెండు ప్రయోజనాలు లభిస్తాయని రైల్వే శాఖ భావిస్తోంది. రైల్వే టికెట్లిచ్చే కౌంటర్ల వద్ద రద్దీ తగ్గుతుందట.

ఇక రెండోది నోట్ల రద్దుతో అవస్థలు పడుతున్న జనానికి ఉపశమనం కలిగించడమట. అయితే ఆన్లైన్ ద్వారా రైల్వే టికెట్స్ బుకింగ్ చేసుకునే సదుపాయం ఉందనే సందేహం కలగడం సహజం. అయితే, సాధారణ బోగీల్లో ఎక్కే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకునే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ భావిస్తోంది.

అయితే ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో ఇప్పటికే ఈ సదుపాయం అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయానికి సంబంధించి రైల్వే శాఖ అధికారిక ప్రకటన చేయాల్సి వుంది.

ఇవి కూడా చదవండి:సైబర్ నేరగాళ్ల దెబ్బకు ఖాతాలో సొమ్ము మాయం

ఇవి కూడా చదవండి:కొత్త 500 నోట్ల కొరతపై వాస్తవం చెప్పిన ఆర్బిఐ

English summary

People were struggling from when Government has declared that they were going to cancel the 500 and 1000 rupees currency notes and now Indian Railways were thinking that to link ATVM machines to ATM's then the user can purchase ticket with their ATM cards.