ఇకపై సెకనుకు రెండు సినిమాలు డౌన్లోడ్!

Now we can download 2 movies in a second

11:59 AM ON 17th August, 2016 By Mirchi Vilas

Now we can download 2 movies in a second

మాములుగా ఒక సినిమా డౌన్లోడ్ చెయ్యాలంటే 2-3 గంటలు పడుతుంది. అదే కాస్త ఎక్కువ స్పీడ్ వున్న నెట్ అయితే అరగంటలో సినిమా డౌన్లోడ్ పూర్తవుతుంది. అయితే ఇప్పుడు ఒక సెకనులో 2 జిగాబైట్ల డేటాను డౌన్లోడ్ చేయగలిగే విధంగా అధునాతన వైర్ లెస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వారు రూపొందించిన నానో క్రిస్టలిన్ మెటీరియల్, నీలి రంగు కాంతి నుంచి తెలుపు వర్ణాన్ని వేరు చేయగలిగింది. దీంతో ఇంటర్నెట్ వేగం సెకనుకు 2 జీబీపీఎస్ వరకూ పెరుగుతుందని, కాంతి ఆధారిత సమాచార మార్పిడి టెక్నాలజీ సాకారమయ్యే సమయం ఎంతో దూరంలో లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.

ప్రస్తుతం విద్యుత్ అయస్కాంత తరంగాలను వాడుతూ, సమాచార డౌన్లోడ్ జరుగుతుండగా, కాంతి అందుబాటులోకి వస్తే డేటా ట్రాన్స్ ఫర్ ఎన్నో రెట్లు పెరుగుతుందన్న అంచనాలతో చాలా సంవత్సరాలుగా ప్రయోగాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇంత వేగంతో నెట్ స్పీడ్ ఉంటే, సెకనుకు రెండు సినిమాలను డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం దగ్గరవుతుంది.

English summary

Now we can download 2 movies in a second