మూత్రంతో విద్యుత్ రానుందా !

Now We Can Produce Electricity From Toilet

11:42 AM ON 19th March, 2016 By Mirchi Vilas

Now We Can Produce Electricity From Toilet

కాదేదీ విధ్యుత్ తయారికి అనర్హం అనాల్సిన్స పరిస్థితులు వస్తున్నాయి. అవును మరి ... మనకి ఇప్పటి వరకు ఇంధన విద్యుత్‌, జల విద్యుత్‌, పవన విద్యుత్‌ల గురించే బాగా తెలుసు. ఇటీవల చెత్త నుంచి కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చెయ్యెచ్చని శాస్త్రవేత్తలు చెప్పడం , జోరుగా ఆ ప్రయత్నాలు చేయడం కూడా ఎరుకే. ఇక ఇప్పుడు మరో సరికొత్త విద్యుత్‌ మనకు అందుబాటులోకి వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అదేమిటని అనుకుంటున్నారా.. అదే మూత్ర విద్యుత్‌....

అతి శక్తివంతమైన ఓ చిన్న ఫ్యూయల్‌ సెల్‌ పరికరంతో మూత్రాన్ని విద్యుత్‌గా మార్చవచ్చని లండన్‌ బాత్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు చెబుతున్నారు. బ్రిస్టల్‌ రోబోటిక్‌ ల్యాబరేటరీ టెక్నాలజీతో ఈ ప్రయోగం నిర్వహించారు. ఈ విధానంలో ఫ్యూయల్‌ సెల్స్‌ అతి కీలకం కానున్నాయి. ఈ ఫ్యూయల్‌ సెల్స్‌ నిర్మాణం చాలా సులభం. దీని నిర్మాణానికి ఎటువంటి ఖరీదైన వస్తువులూ అవసరం లేదని, కేవలం కార్బన్‌, కాటన్‌, టైటానియమ్‌ వైర్లతో ఈ ఫ్యూయల్‌ సెల్‌ను తయారు చేయవచ్చని తెలిపారు. మూత్రంలో ఉండే జీవశక్తిని వినియోగించుకుని ఫ్యూయల్‌ సెల్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని, ఈ ఫ్యూయల్‌ సెల్‌ ఖరీదు కూడా చాలా తక్కువని పరిశోధకులు వెల్లడించారు. ఇదే వినియోగంలోకి వస్తే , ఇక మూత్రానికి గిరాకీ తప్పదేమో ...

సెక్స్ చేయకూడని 11 ప్లేస్ లు ఏవో తెలుసా..

వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన శ్రీమంతుడు తల్లి

రక్త హీనత దూరం కావాలంటే బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్

సమంత ‘నాకు ఇంకో పేరుంది’ మోషన్ పోస్టర్

English summary

Scientists Of Bath University in London has invented a new type of way to produce electricity. The scientists made electricity from Human Urine.