ఇక నుంచి అంత్యక్రియలు కూడా లైవ్ లో చూడొచ్చు

Now we can see cremation online

11:57 AM ON 30th December, 2016 By Mirchi Vilas

Now we can see cremation online

అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు శ్మశానవాటికలకు కూడా చేరువైంది. మరణించిన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చే బంధుమిత్రులకు శ్మశానవాటిక ఉన్న ప్రాంతం గురించి, అంత్యక్రియల గురించి సమాచారం అందించాలన్నా, ఎవరైనా విదేశాల్లో ఉండి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాలేకపోయినా వారికి లైవ్ లో అంత్యక్రియల కార్యక్రమం చూసేలా ప్రత్యక్షప్రసారం చేసేందుకు వీలుగా శ్మశానవాటికలో మొట్టమొదటిసారి వైఫైను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనతను చెన్నైలోని వెలాంగడు శ్మశానవాటిక సొంతం చేసుకుంది.

చెన్నై నగర పాలకసంస్థ నుంచి వెలాంగడు శ్మశానవాటిక నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన ఇండియన్ కమ్యూనిటీ వెల్పేర్ ఆర్గనైజేషన్ మొదటిసారి ఇక్కడ వైఫై సౌకర్యం కల్పించారు. 125 పూలకుండీలు ఏర్పాటు చేసి శ్మశానవాటిక ప్రహరీ గోడపై రంగురంగుల బొమ్మల చిత్రాలు వేసి శ్మశానవాటికను అందంగా తీర్చిదిద్దారు.

శ్మశానవాటికలో సీసీ కెమేరాలు, అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే వారికోసం చల్లని మంచినీటిని అందించేందుకు కూలరును ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు సెక్యూరిటీ గార్డులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. తమ శ్మశానవాటికలో రోజుకు ఆరుగురు చొప్పన నెలకు 150 మంది అంత్యక్రియలు చేస్తున్నామని కార్యదర్శి పేర్కొన్నారు.

శ్మశానవాటికలో వైఫై సౌకర్యం ఏర్పాటు వల్ల తమకు ఆదరణ పెరిగిందని సంఘం వ్యవస్థాపక కార్యదర్శి హరిహరన్ చెప్పేమాట. తమ శ్మశానవాటికలో 11 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, వారిలో ఇద్దరు మహిళలు సైతం ఉన్నారని చెప్పారు. అధునాతన పరిజానం ఇప్పడు ప్రజాజీవనాన్ని మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతుందనటానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనని చెప్పవచ్చు. తాము శ్మశానవాటికలో పనిచేయాలంటే ముందు భయపడినా ఇలా సేవలందిస్తున్నందుకు గర్వంగా ఉందని శ్మశానవాటిక మహిళా ఉద్యోగినులు ప్రవీణ, దివ్య చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: రాత్రిళ్ళు అక్కడికి వెళ్తే, తిరిగిరావడం కష్టమట ... అయితే అక్కడేం వున్నాయి (వీడియో)

ఇవి కూడా చదవండి: ఇవి సడెన్ గా ఆపేస్తే… లావై పోతారట నిజమా?

English summary

An organisation in Chennai has adopted the burial ground from municipality and they have provided the facilities like Coolers for water, WiFi facility, and they also cleaned and painted it very beautifully.