ఇంటర్నెట్ లేకుండా మొబైల్ లో సినిమాలు చూడవచ్చట!

Now we can see movies in mobile without Internet

03:18 PM ON 4th June, 2016 By Mirchi Vilas

Now we can see movies in mobile without Internet

300 పెట్టి నెట్ బ్యాలెన్స్ వేసుకుంటే 3జి 1జిబి నెట్ బ్యాలెన్స్ వస్తుంది. అది కూడా పెద్ద స్పీడ్ ఏమీ రాదు, ఒకవేళ స్పీడ్ వచ్చిన సరిగ్గా రెండు వీడియోలు చూస్తే నెట్ బ్యాలెన్స్ మొత్తం గోవిందా.. అది ప్రస్తుత నెట్వర్క్ ల యొక్క దోపిడీ దాడి. అలాంటిది ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా మీ మొబైల్స్ లో సినిమాలు చూడొచ్చు, నచ్చిన గేమ్స్ ఆడుకోవచ్చు. ఇదెలా అనుకుంటున్నారా? ఎక్కడ అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే.. ఈ సౌకర్యం ఆంధ్రపదేశ్ లోని బస్సుల్లో మాత్రమే. తమ ప్రయాణీకులకు ఉచిత వినోదాన్ని అందించేందుకు ఏపిఎస్ఆర్టిసి వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది.

జపాన్ కు చెందిన మై ధియేటర్ సంస్థ సౌజన్యంతో అదే పేరుతో ఒక యాప్ ను రూపొందించింది. ఆండ్రాయిడ్ ఐఫోన్ వినియోగదారులకు ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మన ఫోన్లో నిక్షిప్తం చేసుకుంటే చాలు. ఏపిఎస్ఆర్టిసి బస్సులో ఎక్కినప్పడు మనకిచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ ద్వారా దీన్ని యాక్టివేట్ చేసుకుంటే 24 గంటల పాటు ఉచితంగా పనిచేస్తుంది. ఆ సమయమంతా ఇంట్రానెట్ ద్వారా ఆన్లైన్ టు ఆఫ్లైన్ అనే విధానం ద్వారా సినిమాలు చూడొచ్చు, పాటలు వినొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు. ఈ తరహా ఉచిత ప్రయాణ సదుపాయం జపాన్ లో అదీ విమాన ప్రయాణీకులకు మాత్రమే ఉంది.

ఏపిలో ఆర్టిసి ఈ సదుపాయాన్ని తమ బస్సుల్లో ప్రవేశపెట్టి సాంకేతికతలో కొత్త అడుగు వేసింది. నిజంగా బాగుంది కదూ..

English summary

Now we can see movies in mobile without Internet