వాట్సాప్‌లో ఇక డాక్యుమెంట్లకూ చాన్స్ ...

Now We Can Send Documents In WhatsApp

10:12 AM ON 3rd March, 2016 By Mirchi Vilas

Now We Can Send Documents In WhatsApp

సోషల్ మీడియా రంగంలో రోజు రోజుకూ వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రముఖ మెసేజింగ్‌ సర్వీస్‌ యాప్‌ వాట్సాప్‌ ఇప్పుడు మరి అడుగు ముందుకేసింది. ఇప్పటివరకూ ఫొటోలు, ఆడియో, వీడియో ఫైల్స్‌ పంపిస్తుండగా, తాజాగా వాట్సాప్‌ చాట్‌లో డాక్యుమెంట్లు కూడా పంపించుకునే సామర్థ్యాన్ని అదనంగా చేర్చారు.ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ల తాజా వాట్సాప్‌ వెర్షన్‌లలో ఈ ఫీచర్‌ కనిపిస్తుంది. కొత్త ఫీచర్‌ చేరిన ఆండ్రాయిడ్‌ వీ2.12.453, ఐఓఎస్‌ వీ2.12.4 వెర్షన్లను గూగుల్‌ప్లే, యాప్‌స్టోర్‌ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అప్‌డేటెడ్‌ వెర్షన్‌లలో వాట్సాప్‌ డాక్యుమెంట్‌ షేరింగ్‌తో పాటు మరికొన్ని కొత్త ఫీచర్లను చేర్చారు. ఇక ఎందుకు ఆలస్యం వాడేసుకుందాం ....

English summary