ఇక పై యాహూలో జీమెయిల్ వాడొచ్చు..

Now We Can Use Your Gmail Account Inside Yahoo Mail

06:12 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Now We Can Use Your Gmail Account Inside Yahoo Mail

ప్రస్తుతం మనలో చాలామందికి యాహూ మెయిల్, జీమెయిల్ రెండు అకౌంట్లు ఉంటాయి. కానీ వాస్తవానికి యాహూ మెయిల్, జీ మెయిల్ రెండూ వేర్వేరు. ఇకపై యాహూలోనే జీ మెయిల్ ఖాతా తెరచి వినియోగించుకునే సౌకర్యం కల్పించనున్నారు. ఈ విషయాన్ని యూహూ వెల్లడించింది. జీమెయిల్, గూగుల్ యాప్స్ కు సర్వర్ సైడ్ సపోర్టును విస్తృతం చేస్తున్నామని యాహూ ప్రతినిధులు వెల్లడించారు. ఈ నూతన ఫీచర్ యూజర్లను మరింత ఆకట్టుకుంటుందని తెలిపారు. ఔట్ లుక్, హాట్ మెయిల్, ఏవోఎల్ మెయిల్ వంటి వాటిని యాహూ మెయిల్ ఇప్పటికే సపోర్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జీమెయిల్ కూడా చేరింది. వినియోగదారులు మరింత సమర్థవంతంగా మెయిల్ సేవలను వినియోగించుకోవాలన్న లక్ష్యంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నామని యాహూ చెపుతోంది. భవిష్యత్తులో మరిన్ని ఫీచర్లను కూడా వినియోగదారులకు అందిస్తామంటోంది.

English summary

Now we can also use our Gmail accounts with Yahoo Mail. Yahoo announced that it has launched a new feature that support to enable Gmail