జీమెయిల్‌లో మిగిలిన మెయిల్స్ సేవలు..!

Now We Can Use Your Other Mails In Gmail

03:46 PM ON 19th February, 2016 By Mirchi Vilas

Now We Can Use Your Other Mails In Gmail

మెయిల్‌ సర్వీసుల్లో అగ్రగామిగా నిలిచిన జీమెయిల్‌లో ఇప్పుడు మరో సరికొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మనలో చాలామందికి యాహూ మెయిల్, జీమెయిల్ రెండు అకౌంట్లు ఉంటాయి. కానీ వాస్తవానికి యాహూ మెయిల్, జీ మెయిల్ రెండూ వేర్వేరు. ఇక పై జీ మెయిల్ లోనే ఖాతా తెరచి యాహూ.. అవుట్‌లుక్‌.. హాట్‌మెయిళ్లను కూడా జీమెయిల్‌లో వినియోగించుకునే సౌకర్యం సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు గూగుల్‌ వెల్లడించింది. ‘జీమెయిల్‌ఫై’ పేరుతో ఈ ఫీచర్‌ను అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం యాహూ, హాట్‌మెయిల్‌, మైక్రోసాఫ్ట్‌ అవుట్‌లుక్‌ ఈమెయిళ్లకు మాత్రమే జీమెయిల్‌ ఫై పనిచేస్తుందని.. త్వరలో మరిన్ని అందుబాటులోకి వస్తాయని గూగుల్‌ చెబుతోంది. ‘జీమెయిల్‌ఫై’ సదుపాయం కోసం.. ముందుగా జీమెయిల్‌లోకి అన్ని ఈమెయిల్‌ ఐడీలు.. పాస్‌వర్డ్‌లతో లాగిన్‌ అవ్వాలి. ఆ తర్వాత ‘జీమెయిల్‌ఫై’ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేయాలి. యాహూ.. అవుట్‌లుక్‌.. హాట్‌మెయిల్‌ మెయిళ్లకూ స్పామ్‌ ప్రొటెక్షన్‌.. ఇన్‌బాక్స్‌ టూల్స్‌ పనిచేస్తాయి. ఒకవేళ వద్దనుకుంటే కొన్ని మెయిల్‌ ఐడీలను జీమెయిల్‌ఫై నుంచి తొలగించే వీలూ ఉంటుంది. ఈమేరకు జీమెయిల్‌ తన అధికారిక బ్లాగులో వెల్లడించింది. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

English summary

A latest feature bought by Gmail .With this latest feature we can access all our other Mail accounts in our Gmail.This officially said by one of the Gmail officials.With these feature we can read all of our mails through one tab.