బ్రేకింగ్ న్యూస్: ఇకపై అయ్యప్ప గుళ్ళోకి మహిళలు కూడా వెళ్లొచ్చట!

Now women also allowed to Sabarimala temple

10:38 AM ON 8th November, 2016 By Mirchi Vilas

Now women also allowed to Sabarimala temple

దేశంలో ఓ ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శబరిమల గుడిలోకి మహిళ ప్రవేశంపై కేరళ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం గైకొంది. దీంతో ఈ అంశంపై కొనసాగుతున్న వివాదానికి ఎట్టకేలకు కేరళ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇకపై మహిళలు గర్భగుడిలోకి ప్రవేశించవచ్చంటూ తెలిపింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని సోమవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. శబరిమల గుడిలోకి తమను అనుమతించాలని కోరుతూ కొన్నేళ్లుగా మహిళలు ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే! ఈ వ్యవహారం చివరకు ముదిరింది.. వివాదాస్పదమై కోర్టుకి చేరింది. పీరియడ్స్ కి లోనయ్యే బాలికల నుంచి 50 ఏళ్ల మహిళల వరకు ఈ ఆలయంలోకి ప్రవేశించరాదన్న నిబంధనను ఆలయ బోర్డు అమలు చేస్తోంది.

అయితే మహిళల ప్రవేశాన్ని నిరాకరించడం పట్ల వాళ్లపై వివక్ష చూపడమేనంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. విచారణ సందర్భంగా ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరాకరించడంపై సుప్రీంకోర్టు గతంలో కీలకవ్యాఖ్యలు చేసింది.

1/4 Pages

దేవుణ్ణి పూజించడానికి ఫలానా భక్తులు మాత్రమే అర్హులని ఎక్కడైనా ఉందా? అసలు దేవునికి భక్తుల విషయంలో తేడాలుంటాయా? చిన్నా, పెద్దా, కులం, మతంతో పాటు లింగబేధం కూడా ఉంటాయా? అని ప్రశ్నించింది.

English summary

Now women also allowed to Sabarimala temple