ఇప్పుడు గంటలో ఇల్లు కట్టేయొచ్చు(వీడియో)

Now you can build home in hours

10:23 AM ON 22nd June, 2016 By Mirchi Vilas

Now you can build home in hours

అబ్బో, నిజమా అంత టెక్నాలజీ పెరిగిందా, ఎందుకంటే ఇల్లు కట్టడం మామూలు విషయం కానే కాదు. వేసుకున్న అంచనా కన్నా, రెండు మూడు రేట్లు అంచనా పెరుగుతుంది. అప్పుల పాలవుతారు. అందుకే అన్నారు ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసిచూడు.. అని మన పెద్దలు. అందునా ఇప్పుడు ఇల్లు కట్టాలంటే తలకు మించిన భారం అందుకే కట్టినవి కొనేసుకుంటున్నారు. కారణం నిర్మాణ ఖర్చులతో పాటు.. భవన నిర్మాణ కార్మికుల కూలీలు అమాంతం పెరిగిపోయాయి. అందుకే ఇప్పుడు ఇంటి నిర్మాణం కష్టసాధ్యంగా మారింది. ఇలాంటి కష్టం నుంచి విముక్తి కల్పించేందుకు ఓ స్టార్టప్ కంపెనీ భావించింది.

ఇందుకోసం సరికొత్త ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆస్ట్రేలియాకు చెందిన కడెగో అనే కంపెనీ హ్యూమనీహట్ షెల్టర్ సిస్టమ్ పేరుతో ఈ ఇంటిని డిజైన్ చేసింది. పిండికొద్దీ రొట్టె అన్నట్టు... పెట్టిన ఖర్చును అనుసరించే ఆ ఇంట్లో సౌకర్యాలు కూడా కల్పించనుంది. ఈ ఇల్లు ప్రకృతి విపత్తులు సంభవించినపుడు, శరణార్ధులకు ఆశ్రయం కల్పించడం వంటి సమయాల్లో ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ ఇంటి నిర్మాణం ఎలా చేపడుతారో కూడా ఓ వీడియోను తీసి ప్రసార మాధ్యమాల్లో అప్ లోడ్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా హల్ చల్ సృష్టిస్తోంది.

English summary

Now you can build home in hours