ఫేస్‌బుక్ ద్వారా డబ్బు సంపాదించొచ్చు.. ఎలాగో తెలుసా?

Now you can earn money by Facebook

11:45 AM ON 23rd April, 2016 By Mirchi Vilas

Now you can earn money by Facebook

ఫేస్‌బుక్ ఇప్పుడు ఈ ప‌దం ప్ర‌తి రోజు విన‌నిదే.. ఈ ఫేస్‌బుక్ చూడ‌నిదే ప్ర‌పంచంలో మూడో వంతు మందికి రోజు గ‌డ‌వ‌దు. సోష‌ల్ మీడియాలో బ‌ల‌మైన శ‌క్తిగా ఉన్న ఫేస్‌బుక్‌తోనే ఇప్పుడు చాలా మందికి రోజు గ‌డుస్తుందంటే అతిశ‌యోక్తి కాదు. ఫేస్‌బుక్‌లో నిరంతం కార్య‌క‌లాపాలు చేసే మీలాంటి వారి కోసమే ఫేస్‌బుక్ త్వరలో ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అదే కంటెంట్ మానెటైజేషన్(content monetization). అంటే మీరు పోస్టుల్లో పెట్టే కంటెంట్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చన్న మాట! అయితే దీనికోసం యూజర్లు తాము పెట్టే పోస్టుల్లో ఫేస్‌బుక్ అందించే యాడ్స్‌ను ఉంచాల్సి వస్తుంది.

వాటిని ఎవరైనా వేరే యూజర్లు క్లిక్ చేస్తే ఆ అకౌంట్ హోల్డర్‌కు డబ్బులు వస్తాయన్నమాట. ఇప్పటికే దీని పై ఆ సంస్థలో అంతర్గతంగా పలు ప్రయోగాలు జరుగుతున్నట్టు సమాచారం. అమెరికాలో కొంత మంది వెరిఫైడ్ యూజర్లకు ఫేస్‌బుక్ పలు సర్వేలు కూడా నిర్వహిస్తోందని తెలిసింది. ఈ క్రమంలో అతి త్వరలోనే ఫేస్‌బుక్ తన అడ్వర్టైజింగ్ ద్వారా యూజర్లకు డబ్బు సంపాదించుకునే వెసులు బాటు కల్పించనుందని తెలుస్తోంది. బ్రాండ్ స్పాన్సర్‌షిప్, మార్కెటింగ్, డొనేషన్ వంటి పలు విధానాలను కూడా ఫేస్‌బుక్ తన యూజర్లకు అందుబాటులోకి తేనుందని తెలిసింది.

ఇంకేం! ఫేస్‌బుక్ కంటెంట్ మానెటైజేషన్ వచ్చే దాకా ఆగండి! ఎంచక్కా పోస్టులు కొడుతూ డబ్బులు సంపాదించవచ్చు. ఇంక మీరు ఇంట్లోనే కూర్చుని డబ్బులు సంపాదించవచ్చు మాట.

English summary

Now you can earn money by Facebook. Now you can earn by Facebook with Content Monetization. By this you can earn money by spending in home only.