ఓరి నాయనో రూ. 3 వేల కోట్ల ఫ్రాడ్ కి తెగబడ్డారు

Nri couple fraud 3 thousand crores

12:04 PM ON 14th July, 2016 By Mirchi Vilas

Nri couple fraud 3 thousand crores

ఈమధ్య ఫ్రాడ్ చేయడం , చీట్ చేయడం , ఎగ్గొట్టడం ఫాషన్ గా మారింది. అలాంటి వారికే గౌరవ మర్యాదలు ఇస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలోని ఎన్నారై దంపతులు తమను నమ్మిన కంపెనీని బురిడీ కొట్టించారు. పంకజ్ ఓస్వాల్, అతని భార్య రాధిక అనే ఈ కపుల్.. చాకచక్యంగా అపాచె కంపెనీని మోసగించి ఆర్ధిక నేరం కేసు నెదుర్కొంటున్నారు. పెర్త్ లో తాజ్ మహల్ వంటి భవనాన్ని సగం లోనే నిర్మించి వీళ్ళు వదిలేశారు. దుబాయ్ నుంచి గత ఏప్రిల్ లో ఆస్ట్రేలియా తిరిగి వచ్చి ఈ భారీ ఫ్రాడ్ కు పాల్పడ్డారు. ఇప్పుడు వీరే అపాచె కంపెనీని ముంచారు. ఈ కపుల్ ఇండియా కు చేరుకున్నట్టు అనుమానిస్తున్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలో బరప్ అమోనియా ప్లాంట్ నిర్మాణానికి పెట్టుబడులు కావాలని పంకజ్ కోరగా ఆ ప్లాంట్ కు గ్యాస్ సరఫరా చేస్తున్న యూఎస్ లోని అపాచె కంపెనీ ముందుకొచ్చింది.

సుమారు మూడు వేల కోట్లకు పైగా ఒప్పందానికి సంబంధించిన ఈ కాంట్రాక్టులో ఈ దంపతులు సొమ్ము వివరాలు దాచిపెట్టి అందులో వెయ్యి కోట్లను తమ ఫర్టిలైజర్ కంపెనీకి, పెర్త్ లైఫ్ స్టయిల్ లో తాజ్ మహల్ ఆన్ ది స్వాన్ పేరిట నిర్మిస్తున్న భవనానికి వినియోగించుకున్నారని అపాచె కంపెనీ న్యాయవాది అండర్సన్ విక్టోరియన్ సుప్రీం కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. పైగా తమ సంస్థ లావాదేవీలను పర్యవేక్షిస్తున్న ఎ యెన్ జెడ్ బ్యాంకు కు తప్పుడు సమాచారం ఇచ్చారని కూడా ఆయన ఆరోపించాడు. అంతేగాక వివరాలు దాచినందుకు కంపెనీ సలహాదారులకు రూ.170 కోట్ల ముడుపులు ఇవ్వజూపారన్నారు.

తాము 2,700 కోట్ల విలువైన గ్యాస్ ను అమ్మినట్టు ఆయన పేర్కొన్నాడు.. డబ్బు చేతికి అందిన వెంటనే ఈ దంపతులు దేశం వదిలి పరారయ్యారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా..గతంలో (2011లో) ఈ దంపతులే తమను ఎ యెన్ జెడ్ బ్యాంకు దాదాపు వంద కోట్ల మేర మోసగించిందని ఆరోపించారు. తమ సంపదను ఈ బ్యాంక్ దోచేసిందన్నారు

ఇది కూడా చూడండి: తారాస్థాయికి చేరిన మెగా అభిమానం

ఇది కూడా చూడండి: ఇక్కడ టాప్ హీరోయిన్లే ... అక్కడ జీరోయిన్లు అవుతున్నారు

ఇది కూడా చూడండి: రోడ్లపై తెలుపు, పసుపు రంగు గీతలు వేసేది ఇందుకేనా...

English summary

Australian NRI couple fraud 3 thousand crores.