చెన్నైను ఆదుకుంటున్న ఎన్నారైలు

NRI Helps To Chennai Flood Victims

12:00 PM ON 7th December, 2015 By Mirchi Vilas

NRI Helps To Chennai Flood Victims

వరద తాకిడికి అతలాకుతలమైన చెన్నై ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది. వదర ఉధృతి తగ్గుముఖం పట్టడంతో నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కానీ వరద మిగిల్చిన విధ్వంసం తాలూకా ప్రభావం ఎంతన్నది ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. స్వచ్ఛంద సంస్థలు, సినీతారలు తమకు తోచిన రీతిలో సహాయాన్ని అందిస్తున్నారు. చెన్నై గడ్డ మీద పుట్టి విదేశాలలో, దేశంలోని ఇతర ప్రాంతాలలో స్థిరపడ్డ చెన్నైవాసులు ఇప్పుడు తమ గడ్డ రుణాన్ని తీర్చుకునేందుకు, కష్టాల కడలిలో చిక్కుకున్న చెన్నైకు సాంత్వన చేకూర్చేందుకు సిద్ధమవుతున్నారు.దేశంలో బెంగుళూరు, ముంబాయిలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా సింగపూర్‌, దుబాయి, యుఎస్‌లలో స్థిరపడిన చెన్నైవాసులు ఆపన్నసమయంలో చేయూతనందిస్తున్నారు.

సింగపూర్‌కు చెందిన మెరీన్‌ ఇంజనీర్‌ ఒకరు 1.5లక్షల రూపాయలను విరాళంగా చెన్నైకు పంపారట. సింగపూర్‌లోని క్రికెట్‌ క్లబ్‌లోని సభ్యుల సాయంతో ఈ నగదును చెన్నైకు పంపారు. మరో 2.5లక్షల రూపాయలను ఇతరుల నుండి సేకరించేందుకు సన్నద్ధమయ్యారు.

దుబాయికి చెందిన ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ల ద్వారా చెన్నైకు విరాళాలు సేకరించే పనిలో పడ్డారు అక్కడి చెన్నైవాసులు. చెన్నైలోని స్కూళ్ళు, కార్యాలయాల ఉద్యోగులు, విద్యార్ధులు యుఎస్‌లోని తమకు తెలిసిన పరిచయుస్థుల ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. బెంగుళూరుకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ టిసిఎస్‌ తరపున ఉద్యోగులు ఇప్పటికే ట్రక్కుల్లో ఆహారాన్ని, నిత్యావసర వస్తువులను చెన్నైకు పంపించారు.

ఇలా ఎవరికి తోచిన రీతిలో ప్రతీఒక్కరూ చెన్నైను కష్టాల కడలినుండి దాటించడానికి తమ వంత సాయం అందిస్తున్నారు.

English summary

Chennai had damaged with heavy rains recently. Chennai was fully flooded with rain water and somm many people loass their lives. Various movie actors politicians were helping by giving money to relief fund and now NRI's were also came to help in their way to chennai people