షాకింగ్ న్యూస్: ఆస్ట్రేలియాలో మృతి చెందిన రమ్యకృష్ణ!

Nri Ramyakrishna dies in Australia

12:52 PM ON 28th May, 2016 By Mirchi Vilas

Nri Ramyakrishna dies in Australia

రమ్యకృష్ణ అంటే సినీనటి రమ్యకృష్ణ కాదండి ఆమె పేరు రమ్యకృష్ణ. వివరాల్లోకి వెళితే.. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది, హైదరాబాద్ కి చెందిన రమ్యకృష్ణ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. రమ్యను అదనపు కట్నం కోసం భర్తే చంపాడని మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మూడు నెలల క్రితం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉంటున్న మహంత్తో హైదరాబాద్ కూకట్పల్లి వాసి రమ్య వివాహం జరిగింది. రమ్య భర్త మహంత్ను కఠినంగా శిక్షించాలంటూ రమ్య బంధువులు ఆందోళనకు దిగారు. శుక్రవారం రాత్రి రమ్య మృతదేహం హైదరాబాద్కు చేరుకుంది.

రమ్య ఆత్మహత్య చేసుకున్నట్లు రెండు రోజుల క్రితం కటుుంబ సభ్యులకు సమాచారం అందింది. అత్తింటివారే రమ్యను చంపి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు. పెళ్లి సమయంలో కట్నకానుకల కింద భారీగా నగదుతో పాటు బంగారాన్ని కూడా ఇచ్చినట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో మహంత్ గత కొంత కాలంగా అదనపు కట్నం కోసం రమ్యను వేధింపులకు గురి చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన పై స్థానిక పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.

English summary

Nri Ramyakrishna dies in Australia